Chiranjeevi Wife Special Gift to Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన చిరు సతీమణి సురేఖ, అరుదైన పెన్నును స్వయంగా జేబులో పెట్టి ఆశీర్వదించిన వదినమ్మ, పెన్ను ఖరీదెంతంటే? (వీడియో ఇదుగోండి)
సురేఖ స్వయంగా ఆ పెన్నును పవన్ కల్యాణ్ జేబులో పెట్టారు. ఈ మోంట్ బ్లాంక్ (Mount Blank Pen) పెన్ను ధర రూ.90 వేలు-రూ.2.60 లక్షల మధ్య ఉంటుంది. పవన్ కు సురేఖ పెన్ను ఇస్తుండగా తీసిన వీడియోను మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Hyderabad, June 15: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విజయం సాధించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తన సోదరుడు చిరంజీవి (Chiranjeevi) కుటుంబాన్ని కలిశారు. హైదరాబాద్ లోని తమ ఇంటికి వచ్చిన పవన్ కల్యాణ్ కు ఆయన వదిన సురేఖ (Surekha) ఖరీదైన పెన్నును ఇచ్చారు. సురేఖ స్వయంగా ఆ పెన్నును పవన్ కల్యాణ్ జేబులో పెట్టారు. ఈ మోంట్ బ్లాంక్ (Mount Blank Pen) పెన్ను ధర రూ.90 వేలు-రూ.2.60 లక్షల మధ్య ఉంటుంది. పవన్ కు సురేఖ పెన్ను ఇస్తుండగా తీసిన వీడియోను మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ చేశారు.
కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి! 😍@PawanKalyan pic.twitter.com/vzt6rNX7gt
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 15, 2024
చిరంజీవి, సురేఖ, పవన్ కల్యాణ్, పవన్ భార్య అన్నాలెజినోవా ఫొటోలు దిగారు. పవన్ కు సురేఖ పెన్ను ఇచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా చిరంజీవి ఇంటికి వెళ్లి మెగా కుటుంబ సభ్యులతో గడిపిన విషయం తెలిసిందే.
(The above story first appeared on LatestLY on Jun 15, 2024 08:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

