‘NTR Bharosa’ Pension Scheme: రూ.7000కు బదులు రూ.6,500 పెన్షన్, రూ. 500 నొక్కేస్తున్నారని మహిళ చెబుతున్న వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీని సోమవారం ఉదయం ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీని సోమవారం ఉదయం ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు. తాజాగా కొన్ని చోట్ల రూ.7000కు బదులు రూ.6,500 ఇస్తున్నారని మహిళలు చెబుతున్న వీడియో వైరల్ అవుతోంది.అయితే వీడియో ఎక్కడ తీసారనే దానిపై అధికారిక సమాచారం లేదు. కాగా ప్రభుత్వం పెన్షన్ రూ.4 వేలతో పాటు, ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంపు రూ.3 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలు నగదును అందజేస్తున్న సంగతి విదితమే. వీడియో ఇదిగో, వృద్ధురాలి కాళ్లను పాలతో కడిగి రూ.7,000 పెన్షన్ అందించిన బుద్ధా వెంకన్న
Here's Videos
వైరల్ వీడియో..
ఫించన్ల పంపిణీలో దోపిడికి పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులు.. ప్రభుత్వం రూ. 7వేలు ఫించన్ ఇస్తుంటే రూ. 500 కట్ చేసి రూ. 6500 ఇస్తున్నారని వాపోతున్న పింఛన్ దారులు pic.twitter.com/1oMkHv48RM
— greatandhra (@greatandhranews) July 1, 2024
AP:రూ.7000కు బదులు రూ.6,500 ఇస్తున్నారని మహిళలు చెబుతున్న వీడియో వైరల్ pic.twitter.com/D7UIoDG2i4
— ChotaNews (@ChotaNewsTelugu) July 1, 2024
(The above story first appeared on LatestLY on Jul 01, 2024 07:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

