Renu Desai: పవన్ కల్యాణ్ వల్ల చాలా బాధపడ్డా కానీ ఆ విషయంలో ఆయనకే నా మద్దతు, సంచలన వీడియో పోస్ట్ చేసిన రేణుదేశాయ్, పిల్లల్ని రాజకీయాల్లోకి లాగితే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక (వీడియో ఇదుగోండి)
రేణు దేశాయ్. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు కేరాఫ్ పవన్ కళ్యాణ్ (Pk)గా ఉండే ఈమె ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. 17 ఏండ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్.. తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao)లో కీ రోల్ ప్లే చేస్తుంది.
Pune, AUG 10: రేణు దేశాయ్. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు కేరాఫ్ పవన్ కళ్యాణ్ (Pk)గా ఉండే ఈమె ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. 17 ఏండ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్.. తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao)లో కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి వెబ్ సిరీస్ తీస్తున్నారన్న విషయంపై రేణు దేశాయి తాజాగా సంచలన వీడియో విడుదల చేసింది. ‘సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ మీద వెబ్ సిరీస్, సినిమాలు తీస్తామని కొందరు రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో అంటున్నారు.. అది మంచి పని కాదు’.. అంటూ రేణు దేశాయ్ తెలిపింది.
ఈ వెబ్ సిరీస్‌లో ఆయన పిల్లల గురించి.. మాజీ భార్యల జీవితం గురించి ఉంటుందని తెలిసింది. నా ఇద్దరు పిల్లలనే కాదు. అయన మిగతా ఇద్దరి పిల్లలని కూడా ఇందులోకి లాగొద్దు. పర్సనల్‌గా ఆయన వల్ల నేను హర్ట్ అయ్యింది నిజం. నేను మూవ్ ఆన్ అయ్యాను కానీ.. పర్సనల్ లైఫ్ పక్కన పెడితే సొసైటీకి ఆయన వల్ల మంచి జరుగుతుంది నమ్ముతున్నాను. పొలిటికల్‌గా పవన్‌కు నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. రాజకీయాలు ఉంటే ప్రొఫెషనల్‌గా చూసుకోండి.. కానీ మా వ్యక్తిగత జీవితాలను ఇందులోకి లాగకండి అంటూ రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసింది.
(The above story first appeared on LatestLY on Aug 10, 2023 08:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

