Skill development Scam Case: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా, ఏసీబీ కోర్టులో ఇరువురి వాదనలు ఇవిగో..
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు.స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లభించిన అన్ని ఆధారాలు కోర్టు ఎదుట ఉంచామని, చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ గుర్తించిన అన్ని వివరాలను పరిశీలిస్తే అర్థమవుతుందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు.
Vjy, Oct 4: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు.స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లభించిన అన్ని ఆధారాలు కోర్టు ఎదుట ఉంచామని, చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ గుర్తించిన అన్ని వివరాలను పరిశీలిస్తే అర్థమవుతుందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. చంద్రబాబు గురించి చెప్పడానికి స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఇదేమి ఫిక్షన్ స్టోరీ కాదని, కల్పిత పాత్ర కాదని వ్యాఖ్యానించారు. స్కామ్ జరిగిందని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మరింత లోతుగా విచారించేందుకు కస్టడీకిఇవ్వాలని, బెయిల్ ఇవ్వొద్దని కోరుతున్నామని పేర్కొన్నారు.
చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు. బెయిల్ ఇవ్వొద్దు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలి. స్కిల్ కుంభకోణం దర్యాప్తు కీలక దశలో ఉంది. దర్యాప్తుకు కీలకంగా ఉన్న దశలో చంద్రబాబుకి బెయిల్ ఇవ్వడం సరికాదు. చంద్రబాబుకి బెయిల్ ఇస్తే సాక్షులని ప్రభావితం చేస్తారు. ఇప్పటికే చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకు పారిపోవడం వెనుక చంద్రబాబు హస్తం ఉంది.
రాళ్ల దాడి ప్లాన్ ఆధారాలు చూపించు, పవన్ కళ్యాణ్‌కు నోటీసులు ఇచ్చిన కృష్ణా జిల్లా పోలీసులు
స్కిల్ కుంభకోణంలో రూ.270 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. డొల్ల కంపెనీల పేరుతో నిధులు దారి మళ్లించారు. 21-07-2017లోనే రూ.371 కోట్ల నిధులకు పన్నుల ఎగవేతపై జీఎస్టీ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. 05-01-2018న ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించడంతోపాటు సీబీఐని విచారించాలని జీఎస్టీ కోరింది. ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్ధల విచారణలో ఉండగానే 26-07-2018న 17ఏ సవరణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబుకి 17ఏ వర్తించదు’’ అని వాదించారు.సామాజిక, ఆర్థిక నేరాల్లో బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. స్కిల్ కేసులో అన్నీ చంద్రబాబు సూచనల మేరకే జరిగాయి’’ అని ఏఏజీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వివిపించారు. ‘‘ స్కిల్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి కే.సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు. సునీత అధ్యయనం చేసి ఎలాంటి అభ్యంతరం సీమెన్స్ ప్రాజెక్టుకు తెలపలేదు. సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం లేకుండా కేబినెట్ ఆమోదం పొందిందన్న విషయమై ఆధారాలు ఉన్నాయి. కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్‌మెంట్ ధరను నిర్ధారించింది. ఆ కమిటీలో చంద్రబాబు లేరు.
ఆ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు మధ్యంతర బెయిలును పొడిగించింది. చంద్రబాబుకు ఎలాంటి నోటీసివ్వకుండా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేపట్టారు. ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారు. ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు.. అవసరం ఏముంది?. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది. కెబినెట్ నిర్ణయంపై చంద్రబాబు మీద కేసు ఎలా పెడతారు?’’ అని వాదించారు.ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది.
(The above story first appeared on LatestLY on Oct 04, 2023 08:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

