Special Darshans Cancelled: టీటీడీ కీల‌క నిర్ణ‌యం, ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలు బంద్, ఎప్ప‌టి నుంచి అమ‌ల్లోకి వ‌స్తుందంటే..

తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల (Brahmotsavam) సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు (Darsan cancell) చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా తిరుమల(Tirumala) కు వస్తారని పేర్కొన్నారు

Special Darshans Cancelled: టీటీడీ కీల‌క నిర్ణ‌యం, ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలు బంద్, ఎప్ప‌టి నుంచి అమ‌ల్లోకి వ‌స్తుందంటే..
Tirumala Temple (Credits: X)

Tirumala, AUG 23: తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల (Brahmotsavam) సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు (Darshan cancel) చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా తిరుమల(Tirumala) కు వస్తారని పేర్కొన్నారు. ఈ కారణంగా సామాన్య భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించింది.

Telangana Police: తస్మాత్ జాగ్రత్త!, సోషల్ మీడియా రీల్స్‌ పేరుతో అతి చేస్తే ఇకపై అంతే, కఠినమైన కేసులు తప్పవని పోలీసుల హెచ్చరిక 

దాదాపు పది రోజుల పాటు ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు, సంవత్సరం లోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. ఈ రోజుల్లో బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామని, భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.

(The above story first appeared on LatestLY on Aug 23, 2024 10:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).