Teacher’s Day 2022: ఉపాధ్యాయులకు శిఖరం వంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్‌, ముఖ్యమంత్రిగా విద్యాశాఖపైనే ఎక్కువ సమీక్షలు చేశానని తెలిపిన ఏపీ సీఎం జగన్

భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి (Teacher’s Day 2022) సందర్భంగా విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుపూజోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister Y.S. Jagan Mohan Reddy) హాజరయ్యారు. డాక్టర్‌ సర్వే రాధాకృష్ణ విగ్రహానికి సీఎం నివాళులర్పించారు.

Teacher’s Day 2022: ఉపాధ్యాయులకు శిఖరం వంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్‌, ముఖ్యమంత్రిగా విద్యాశాఖపైనే ఎక్కువ సమీక్షలు చేశానని తెలిపిన ఏపీ సీఎం జగన్
Jagan Mohan Reddy (Photo-AP CMO/Twitter)

VJY, Sep 5: భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి (Teacher’s Day 2022) సందర్భంగా విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుపూజోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister Y.S. Jagan Mohan Reddy) హాజరయ్యారు.

డాక్టర్‌ సర్వే రాధాకృష్ణ విగ్రహానికి సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..ప్రభుత్వం చేపడుతున్న నూతన విధానాలు ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయడానికి కాదని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను మెరుగుపరిచేందుకు మాత్రమే మార్పులు తీసుకువస్తున్నామని వెల్లడించారు.

విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర గురువులదేనన్నారు. విద్యారంగంలో ( Education Sector) అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ముఖ్యమంత్రిగా విద్యాశాఖపైనే ఎక్కువ సమీక్షలు చేశానన్నారు. ఉపాధ్యాయులకు శిఖరం వంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్‌. సాన పట్టకపోతే వజ్రమైనా కూడా రాయితోనే సమానం. విద్యార్థులను తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉంది. విద్యార్థుల్లోని ప్రతిభను ఉపాధ్యాయులే వెలికితీస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 8 వరకు భారీ వర్షాలు, తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ఉత్తర –దక్షిణ ద్రోణి

నాకు విద్య నేర్పిన గురువులకు రుణపడి ఉంటాను. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో అనేక చర్యలు చేపట్టాం. విద్యా రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్‌ తరాలకు అవసరమైన అందిస్తున్నాం’’ అని సీఎం అన్నారు.

రాష్ట్రంలోని 176 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను సీఎం జగన్‌ ప్రదానం చేసి సత్కరించారు. పాఠశాల విద్యాశాఖ నుంచి 58 మంది ఉపాధ్యాయులు, ఇంటర్‌ విద్య నుంచి 19 మంది, ఉన్నత విద్య నుంచి 60 మంది అధ్యాపకులు, భాషా సాంస్కృతిక శాఖ నుంచి ఐదుగురు, కేజీబీవీల నుంచి ముగ్గురు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఐదుగురు ఈ పురస్కారాలను అందుకున్నారు.

(The above story first appeared on LatestLY on Sep 05, 2022 12:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).