Vangaveeti Radha Engagement: ఆడంబరంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఎంగేజ్‌మెంట్, అక్టోబర్ 22న మ్యారేజ్ డేట్ ఫిక్స్, ఇంతకీ వంగవీటి రాధా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా?

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (రాధా) (Vangaveeti Radha) నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్‌ మాజీ ఛైర్‌ పర్సన్‌ జక్కం అమ్మానీ, బాబ్జీ దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లితో (Pushavalli) రాధా నిశ్చితార్థ వేడుక ఆదివారం నరసాపురంలో జరిగింది.

Vangaveeti Radha Engagement: ఆడంబరంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఎంగేజ్‌మెంట్, అక్టోబర్ 22న మ్యారేజ్ డేట్ ఫిక్స్, ఇంతకీ వంగవీటి రాధా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా?
Vangaveeti Radha Engagement (PIC@ X)

Vijayawada, SEP 03: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (రాధా) (Vangaveeti Radha) నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్‌ మాజీ ఛైర్‌ పర్సన్‌ జక్కం అమ్మానీ, బాబ్జీ దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లితో (Pushavalli) రాధా నిశ్చితార్థ వేడుక ఆదివారం నరసాపురంలో జరిగింది. ఈ వేడుకకు రెండు కుటుంబాలకు చెందిన ముఖ్యమైన బంధువులు, నరసాపురం ప్రాంతానికి చెందిన కొంతమంది ముఖ్య నాయకులనే మాత్రమే ఆహ్వానించారు. అక్టోబరు 22వ తేదీ సాయంత్రం 7.59 గంటలకు వీరి వివాహం జరిపించేందుకు ముహూర్తం నిర్ణయించారు.

నిశ్చితార్థ వేడుకకు (Vangaveeti Radha Jakkam Pushpavalli Engagement) ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జనసేన పార్టీ నరసాపురం ఇన్‌ఛార్జి బొమ్మిడి నాయకర్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

(The above story first appeared on LatestLY on Sep 03, 2023 08:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).