Vijayawada Shocker: ప్రేమన్నాడు..నగ్న వీడియోలతో లవర్‌ని బ్లాక్ మెయిల్ చేశాడు, చివరకు యువతి ఫిర్యాదుతో కటకటాల పాలయ్యాడు, విజయవాడలో దారుణ ఘటన, వివరాలను వెల్లడించిన సైబర్ క్రైమ్ ఏసీపీ బి.రాజారావు
యువకుడిని నమ్మి స్నేహం చేసినందుకు ఓ యువతి తగిన మూల్యం (Vijayawada Shocker) చెల్లించుకుంది. నిన్ను ప్రేమిస్తున్నాననే మాయమాటలను నమ్మిన ఆ యువతి అతనికి తన నగ్న వీడియోలను పంపింది. అయితే ఆ తర్వాత విభేదాలు రావడంతో అతను ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ (Sadistic Boy friend harassment On His Girlfriend) చేయడం ప్రారంభించాడు.
Amaravati, August 22: యువకుడిని నమ్మి స్నేహం చేసినందుకు ఓ యువతి తగిన మూల్యం (Vijayawada Shocker) చెల్లించుకుంది. నిన్ను ప్రేమిస్తున్నాననే మాయమాటలను నమ్మిన ఆ యువతి అతనికి తన నగ్న వీడియోలను పంపింది. అయితే ఆ తర్వాత విభేదాలు రావడంతో అతను ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ (Sadistic Boy friend harassment On His Girlfriend) చేయడం ప్రారంభించాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి సైబర్ క్రైమ్ ఏసీపీ బి.రాజారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
బీహార్‌కు చెందిన రోహిత్‌కుమార్ మూడేళ్ల క్రితం విజయవాడలో (Vijayawada) డిగ్రీ చదువుతున్న ఓ యువతి వెంట పడ్డాడు. ఆ యువతి అతడితో స్నేహం చేసింది. ఇదే అదునుగా భావించిన రోహిత్‌కుమార్ ఆమె స్నేహాన్ని ప్రేమగా మార్చాడు. అతడిని పూర్తిగా నమ్మిన యువతి ఆమె నగ్న వీడియోలను అతడికి పంపింది. ఇటీవల ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఎలాగైనా ఆమెను వేధించాలనుకున్న రోహిత్ కృష్ణలంకకు చెందిన తన స్నేహితుడు దండగల గణేష్‌కు యువతి నగ్న వీడియోలను పంపాడు.
గణేష్ అదే యువతి పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాను తెరిచి.. అందులో ఆమె చిత్రాలను, నగ్న వీడియోలను పోస్టు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు యువతి న్యాయం చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి మూడు రోజుల రిమాండ్ విధించారు.
(The above story first appeared on LatestLY on Aug 22, 2021 06:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

