Viveka Murder Case: వివేకానందరెడ్డి హత్య కేసు, ముగిసిన అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ, తనకు తెలిసిన వాస్తవాలే సీబీఐకి చెప్పానని తెలిపిన కడప ఎంపీ

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case) దర్యాప్తులో భాగంగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ ( MP Avinash Reddy concluded) ముగిసింది. ఇటీవల అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ నేడు మరోసారి సుదీర్ఘంగా 4.30 గంటల పాటు ప్రశ్నించింది.

Viveka Murder Case: వివేకానందరెడ్డి హత్య కేసు, ముగిసిన అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ, తనకు తెలిసిన వాస్తవాలే సీబీఐకి చెప్పానని తెలిపిన కడప ఎంపీ
MP Avinash Reddy (Photo-Video Grab)

Hyd, Feb 24: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case) దర్యాప్తులో భాగంగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ ( MP Avinash Reddy concluded) ముగిసింది. ఇటీవల అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ నేడు మరోసారి సుదీర్ఘంగా 4.30 గంటల పాటు ప్రశ్నించింది. విచారణ అనంతరం మీడియాతో (YSRCP Kadapa MP Press Meet) మాట్లాడారు.గత నెల 28న తనను సీబీఐ (CBI investigation ) విచారించిందని, దానికి కొనసాగింపుగా నేడు కూడా విచారించిందని వెల్లడించారు. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసిన సమాచారం అంతా చెప్పానని తెలిపారు.

సరైన దిశలో విచారణ జరగాలనే తాను చెబుతున్నానని, వాస్తవాన్ని టార్గెట్‌ చేయకుండా వ్యక్తిని టార్గెట్‌ చేసి విచారణ జరుగుతోందని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. సీబీఐ ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పా. సీబీఐ కౌంటర్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగారు..అన్నింటికీ సమాధానాలు చెప్పా. విచారణపై ఎవరికైనా సందేహాలు వస్తాయి. వివేకా చనిపోయిన రోజున మార్చురీ దగ్గర ఏం మాట్లాడానో ఇప్పుడు కూడా అదే చెబుతున్నా.అదే వాస్తవం.

మాజీ మంత్రి నారాయణ కూతురు ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు, పలు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు చేపట్టిన అధికారులు

నేను వెళ్లే సమయానికి లెటర్‌ను దాచిపెట్టారు. ఆ లెటర్‌లో అనేక విషయాలు ఉన్నాయి. విచారణ జరుగుతుండగానే మీడియానే ట్రయల్‌ చేసి దోషులు ఎవరో తేల్చేస్తున్నారు. విజయమ్మ దగ్గరకు వెళ్లి వస్తే బెదిరించడానికి వెళ్లానని ప్రచారం చేశారు. తెల్లవారజామున మూడు గంటలకు ఫోన్లు చేశానంటూ డిబేట్లు పెట్టారు. తప్పుడు వార్తలు వేయకుండా నిజాలను నిజాలుగా వేయండి. మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

టీడీపీ చేసిన విమర్శలే సీబీఐ కౌంటర్‌లో వస్తున్నాయంటే.. గూగుల్‌ టేకౌటా లేక టీడీపీ టేకౌటా అనేది భవిష్యత్‌లో తేలుతుంది.విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డ్‌ చేయాలని కోరాం. ఎక్కడ ఆడియో, వీడియో రికార్డు చేసినట్లు కనిపించలేదు. నేను సీబీఐకి లేఖ ఇచ్చాను. నేను సీబీఐ దృష్టికి తీసుకెళ్లిన అంశాలపై పూర్తి విచారణ చేయాలని కోరాను. మరోసారి విచారణకు రావాలని సీబీఐ నాకు చెప్పలేదు’ అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.

వీడియో ఇదిగో..టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీ నారాయణ, జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి

దోషులెవరో, నిర్దోషులెవరో మీడియానే నిర్ధారిస్తే దర్యాప్తు సంస్థల విచారణపై అది ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడేం జరుగుతోంది అంటే... ఒక అబద్ధాన్ని సున్నా నుంచి వందకు పెంచే ప్రయత్నం జరుగుతోంది.... ఒక నిజాన్ని వంద నుంచి సున్నాకు తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. వాస్తవాలను వెలికితీసే క్రమంలో బాధ్యతగా వ్యవహరించండి" అని మీడియాకు హితవు పలికారు.

విచారణ గురించి అవినాశ్ ఏమన్నారంటే...

ఈ కేసులో నాకు తెలిసిందంతా చెప్పాను. మళ్లీ విచారణకు రావాలని సీబీఐ చెప్పలేదు.

వివేకా హత్య కేసు మొదటి నుంచి వాస్తవాల కంటే కూడా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని నడుస్తోంది. ఇది సరికాదు.

పలు వాస్తవాలతో ఇవాళ సీబీఐ అధికారులకు రిప్రజంటేషన్ ఇచ్చాను. వాటిపైన కూడా విచారణ జరగాలని కోరాను.

గూగుల్ టేక్ ఔట్ అంటున్నారు.... గూగుల్ టేక్ ఔటో, టీడీపీ టేక్ ఔటో కాలమే నిర్ణయిస్తుంది.

ఇవాళ సీబీఐ కౌంటర్ అఫిడవిట్ లో ఏ అంశాలు అయితే కనిపిస్తున్నాయో, అవే అంశాలు టీడీపీ వాళ్లు ఏడాది కిందట ప్రస్తావించారు. టీడీపీ వాళ్లు ఆరోపిస్తున్న విషయాలే సీబీఐ అఫిడవిట్ లో ఉన్నాయి. దీన్నిబట్టి సీబీఐ విచారణ పట్ల ఎవరికైనా సందేహాలు కలుగుతాయి.

వివేకా చనిపోయిన రోజున మార్చురీ వద్ద మీడియాతో మాట్లాడాను... మళ్లా రెండ్రోజుల తర్వాత మీడియాతో మాట్లాడాను. ఆ రోజున ఏం మాట్లాడానో ఇవాళ కూడా అదే మాట్లాడుతున్నా... సీబీఐ వాళ్లతోనూ అదే చెప్పాను. మళ్లీ ఎన్నిసార్లు ఎవరు పిలిచి అడిగినా అదే చెబుతాను. ఎందుకంటే నాకు తెలిసింది అదే.

నేను ఈ కేసులో సాక్షినో, అనుమానితుడ్నో తెలియదు. నాకు 160 సీఆర్పీ కింద నోటీసులు ఇచ్చారు.

వివేకా హత్య జరిగిన తర్వాత నేను ఘటన స్థలానికి వెళ్లే సరికి అక్కడ ఒక లేఖ ఉంది. కానీ ఆ లెటర్ ను దాచిపెట్టేశారు. అది హత్య అని ఆ లేఖలో స్పష్టంగా ఉంది.

నేను చెప్పిన లేఖపై సీబీఐ అధికారులు ఏం నిర్ణయించుకుంటారో చూడాలి.

విచారణను న్యాయవాది పర్యవేక్షణలో, ఆడియో-వీడియో రికార్డింగ్ జరపాలని అడిగాము. అయితే విచారణ రికార్డింగ్ చేసినట్టు నాకు అనిపించలేదు. కానీ లోపల ఒక ల్యాప్ టాప్ మాత్రం నా ఎదురుగా ఉంచారు.

(The above story first appeared on LatestLY on Feb 24, 2023 06:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).