మాజీ మంత్రి నారాయణ (Former Minster Narayana) కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు (AP CID Raids) నిర్వహిస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్‌పల్లిలోని ఇళ్లలో అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. సీఐడీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. నారాయణపై పదోతరగతి పరీక్షాపత్రం లీకేజీ (10th class exam paper leakage)తో పాటు, అమరావతి రాజధాని భూముల (Capital lands of Amaravati)కు సంబంధించి కేసులు నమోదు చేశారు.
ఈ రెండు కేసుల్లో భాగంగా సీఐడీ అధికారులు (CID Officers) పలుమార్లు నారాయణ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. తాజాగా నారాయణ ఇళ్లలో సోదాలు ముగిసిన అనంతరం ఆయన కుమార్తెలను ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి సోదాలు చేస్తున్న అధికారులు పలు రికార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Here's ANI Tweet
CID officials are conducting a raid at the residence of former Andhra Pradesh minister P Narayana's daughter in Hyderabad in connection with an ongoing case pic.twitter.com/x2ArRmovJg
— ANI (@ANI) February 24, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)