Heavy Rains in AP: ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, రాష్ట్రంపై కొనసాగుతున్న షియర్‌ జోన్‌ ప్రభావం, అలర్ట్ జారీ చేసిన విశాఖ వాతావరణ కేంద్రం

ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకూ ఏర్పడిన ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి బలహీనపడింది. దీనివల్ల గాలుల కలయికతో ఏర్పడిన షియర్‌ జోన్‌ ప్రభావం రాష్ట్రంపై కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు కోస్తా, రాయలసీమపై చురుగ్గా ఉన్నాయి.వీటన్నింటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో.. నేడు, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Heavy Rains in AP: ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, రాష్ట్రంపై కొనసాగుతున్న షియర్‌ జోన్‌ ప్రభావం, అలర్ట్ జారీ చేసిన విశాఖ వాతావరణ కేంద్రం
Heavy Rain Alert In Telangana Over Next 2 Days (photo-file image)

Amaravati, July 13: ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకూ ఏర్పడిన ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి బలహీనపడింది. దీనివల్ల గాలుల కలయికతో ఏర్పడిన షియర్‌ జోన్‌ ప్రభావం రాష్ట్రంపై కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు కోస్తా, రాయలసీమపై చురుగ్గా ఉన్నాయి.వీటన్నింటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో.. నేడు, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు (Heavy Rains in AP) పడే సూచనలున్నాయని పేర్కొంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. వెంకటగిరి, చిత్తూరులో 8 సెం.మీ., జియ్యమ్మవలస, తంబాలపల్లె, పలమనేరులో 5, తాడేపల్లిగూడెంలో 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకు వెళ్లకూడదని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం వెంబడి నైరుతి దిశగా ఉత్తర కోస్తా తీరంలో నేడు, రేపు గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. అదేవిధంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరంలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి.

(The above story first appeared on LatestLY on Jul 13, 2020 12:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).