AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2107 కోవిడ్ కేసులు, 20 మరణాలు నమోదు మరియు 1807 మంది రికవరీ, రాష్ట్రంలో 21 వేల ఎగువకు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య
నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1,807 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 19,27,438 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 21,279 ఆక్టివ్ కేసులు...
Amaravathi, July 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. రోజూవారీ కోవిడ్ కేసులు సుమారుగా 2 వేల చొప్పున నమోదవుతున్నాయి. ఒకటి, రెండు జిల్లాలు మినహా దాదాపు అన్ని జిల్లాల్లోనూ పాజిటివిటీ రేటు 3 లోపే ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే రికవరీలు తక్కువగా ఉంటుండటంతో రాష్ట్రంలోనూ మళ్లీ యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. అటు దేశంలోనూ వరుసగా మూడు రోజుల నుంచి కేసులు పెరుగుతుండటం కూడా కొంత కలవరపెడుతుంది. మరో వారం రోజుల్లోనే కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఏపిలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 78,784 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 2,107 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 19,62,049కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 19,59,154 గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 392 కోవిడ్ కేసులు నమోదు కాగా.. తూర్పు గోదావరి జిల్లా నుంచి 316, కృష్ణా జిల్లా నుంచి 303 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 20 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 13,332కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1,807 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 19,27,438 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 21,279 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.
(The above story first appeared on LatestLY on Jul 29, 2021 04:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

