Tirupati Bypoll: లోకేశ్‌, చంద్రబాబులపై డీజీపీకి ఫిర్యాదు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన వైసీపీ నేతలు, ఫేస్‌బుక్‌ అక్కౌంట్‌లో వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరిచే పోస్టులు పెట్టారని ఆరోపణ

టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌లపై వైసీపీ నేతలు డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ అధికార ఫేస్‌బుక్‌ అక్కౌంట్‌లో తమపార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరిచే విధంగా పోస్టింగ్‌లు పెట్టారని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్‌కుమార్‌.. డీజీపీకి ఫిర్యాదు చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Tirupati Bypoll: లోకేశ్‌, చంద్రబాబులపై డీజీపీకి ఫిర్యాదు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన వైసీపీ నేతలు, ఫేస్‌బుక్‌ అక్కౌంట్‌లో వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరిచే పోస్టులు పెట్టారని ఆరోపణ
YSRCP complains to DGP against Nara Lokesh (Photo-Twitter)

Tirupati, April 10: టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌లపై వైసీపీ నేతలు డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ అధికార ఫేస్‌బుక్‌ అక్కౌంట్‌లో తమపార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరిచే విధంగా పోస్టింగ్‌లు పెట్టారని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, డీజీపీకి ఫిర్యాదు చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం డీజీపీని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యేలు.. టీడీపీ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టులను ఆధారాలతో సహా అందజేశారు. కాగా టీడీపీ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌లో ‘ఒకప్పుడు జగన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన దగ్గర విధేయుడిగా ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఇప్పుడు పెద్దిరెడ్డి దగ్గర అంతే విధేయుడిగా ఉన్నాడని, ఎందుకంటే వైఎస్సార్‌సీపీలో దళితులకు ఎదిగే స్వేచ్ఛలేదు. అందుకే ఈసారి వినిపిద్దాం తిరుపతి గొంతు.. లోక్‌సభలో లక్ష్మి గొంతు’ అంటూ సీఎం వైఎస్‌ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లను గురుమూర్తి వత్తుతున్నట్టు ఫొటో సృష్టించి ఉంచారని తెలిపారు.

Here's Tweets

‘ఆంధ్రుల హక్కుల కోసం గళమెత్తువారు కావాలా? పెద్దిరెడ్డి కాళ్లకు మసాజు చేసేవారు కావాలా?’ అని పేర్కొంటూ పోస్టర్‌లో పనబాక లక్ష్మి ఫొటో పెట్టి టీడీపీకి ఓటు వేయండి అంటూ పోస్టులు పెట్టారని వివరించారు. ఈ పోస్టింగ్‌ల ద్వారా గురుమూర్తిని ప్రజల దృష్టిలో బహిరంగంగా అవమానించి, మానసికంగా బాధించారని, గురుమూర్తి కులాన్ని, వ్యక్తిత్వాన్ని, వృత్తిని తీవ్రంగా కించపరిచినట్టు దళిత జాతి యావత్తు భావిస్తోందని తెలిపారు.

కొత్త మలుపులతో తెలంగాణ రాజకీయాలు, జూలై 8న షర్మిలారెడ్డి కొత్త పార్టీ, అదే రోజున పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తామని తెలిపిన వైయస్ఆర్ తనయ, షర్మిల ఇక నా బిడ్డ కాదు.. మీ బిడ్డ అంటున్న వైయస్ విజయమ్మ

సోషల్‌ మీడియాలో వాటిని ట్రోల్‌ చేస్తూ గురుమూర్తిని కించపరిచిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, టీడీపీ ఫేస్‌బుక్‌ అక్కౌంట్‌లో పెట్టిన తప్పుడు పోస్టింగ్‌లు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు బాధ్యులైన చంద్రబాబు, లోకేశ్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ఐటీ యాక్ట్‌ కింద కేసు పెట్టి వారిని అరెస్టు చేయాలని కోరారు.

(The above story first appeared on LatestLY on Apr 10, 2021 12:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).