Nandigam Suresh Gets Bail: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరు, రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరైంది.రూ.10 వేల పూచీకత్తుతో గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020 డిసెంబర్ 27న జరిగిన మరియమ్మ హత్య కేసులో సురేష్ నిందితుడిగా ఉన్నారు.
Vjy, Jan 28: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరైంది.రూ.10 వేల పూచీకత్తుతో గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020 డిసెంబర్ 27న జరిగిన మరియమ్మ హత్య కేసులో సురేష్ నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
2020లో తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మపై సురేష్ అనుచరులు దాడి చేశారు. తనకు వస్తున్న పెన్షన్‌ను నిలిపివేశారని, ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిను మరియమ్మ ధూషించింది. మరియమ్మ ఇంటిపై దాడి చేసి ఆమెను నందిగం సురేష్ అనుచరులు హతమార్చినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి నారా లోకేష్ ను కలిసి న్యాయం చేయాలంటూ మరియమ్మ కుమారుడు విజ్ఞప్తి చేశాడు. మంత్రి లోకేష్ ఆదేశాలతో కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు.. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్టు చేసి జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు నెలలుగా జైల్లో ఉన్న నందిగం సురేష్‌కు తాజాగా బెయిల్ మంజూరైంది.ఆధారాలు లేకుండా సురేష్‌పై కేసులు పెట్టారంటూ కూటమి సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.
(The above story first appeared on LatestLY on Jan 28, 2025 05:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

