TDP Office Attack Case: వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్ట్ చేయడం తెలిసిందే. తాజాగా, ఈ కేసులో మరో నిందితుడు, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్ట్ చేయడం తెలిసిందే. తాజాగా, ఈ కేసులో మరో నిందితుడు, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అప్పిరెడ్డిని పోలీసులు కోర్టులో హాజరు పరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్, టీడీపీ కార్యాలయంపై దాడి ఎఫెక్ట్, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు
కాగా, నందిగం సురేశ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను గుంటూరు జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ కేసులో వైసీపీ నేతలు తలశిల రఘురామ్, దేవినేని అవినాశ్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారి కోసం పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేసి, తీవ్ర స్థాయిలో గాలిస్తున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే.
(The above story first appeared on LatestLY on Sep 05, 2024 06:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

