Robotic Massage Centre: విజయవాడ రైల్వే స్టేషన్‌లో రోబోటిక్ మసాజ్ సెంటర్.. బాడీ మసాజ్‌కు రూ. 60, ఫుట్ మసాజ్‌కు రూ. 30

టికెట్‌యేతర ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించిన దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రైల్వేస్టేషన్‌లో రోబోటిక్ మసాజ్ సెంటర్‌ ను ఏర్పాటు చేసింది.

Robotic Massage Centre: విజయవాడ రైల్వే స్టేషన్‌లో రోబోటిక్ మసాజ్ సెంటర్.. బాడీ మసాజ్‌కు రూ. 60, ఫుట్ మసాజ్‌కు రూ. 30
Credits: Twitter

Vijayawada, Jan 10: టికెట్‌యేతర ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించిన దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రైల్వేస్టేషన్‌లో (Vijayawada Railway Station) రోబోటిక్ మసాజ్ సెంటర్‌ (Robotic Massage Centre)ను ఏర్పాటు చేసింది. ఈ అత్యాధునిక మసాజ్ సెంటర్ ద్వారా ప్రయాణికులు అతి తక్కువ రుసుముతో బాడీ, ఫుట్ మసాజ్ సేవలను పొందొచ్చు. ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌లో రెండు రోబోటిక్ బాడీ మసాజ్ కుర్చీలు, ఒక ఫుట్ మసాజ్ కుర్చీ అందుబాటులో ఉన్నాయి.

నేడే సంకష్ట చతుర్థి.. లేటెస్ట్ లీ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా మీ ప్రెండ్స్, బంధువులకు గ్రీటింగ్స్ పంపండి..

దక్షిణ మధ్య రైల్వే డివిజినల్ మేనేజర్ శివేంద్ర మోహన్ సోమవారం దీనిని ప్రారంభించారు. బాడీ మసాజ్‌కు రూ. 60, ఫుట్ మసాజ్‌కు రూ. 30 రుసుము చెల్లించి రోబోటిక్ మసాజ్ సేవలను పొందొచ్చని ఐఆర్‌టీఎస్ సీనియర్ డీసీఎం వి.రాంబాబు పేర్కొన్నారు. కాగా, స్టేషన్‌లో ఇటీవల ఫిష్ స్పా, హ్యాండ్‌లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్, మొబైల్ యాక్ససరీలకు సంబంధించిన అవుట్‌లెట్లను ప్రారంభించారు.

వైద్యంతో నయంకాని మానసిక సమస్యలతో బాధపడుతున్న భార్యకు విడాకులు ఇవ్వొచ్చు.. పంజాబ్, హర్యానా హైకోర్టు

(The above story first appeared on LatestLY on Jan 10, 2023 09:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).