TS's COVID Update: తెలంగాణలో తగ్గిన కొవిడ్ తీవ్రత, కొత్తగా మరో 253 మందికి పాజిటివ్, రాష్ట్రంలో 5,039గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,87,993కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా స్వల్పంగా 61 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ....

TS's COVID Update: తెలంగాణలో తగ్గిన కొవిడ్ తీవ్రత, కొత్తగా మరో 253 మందికి పాజిటివ్, రాష్ట్రంలో 5,039గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Coronavirus in TS| (Photo Credits: PTI)

Hyderabad, January 5: తెలంగాణలో కొవిడ్ తీవ్రత చాలా వరకు తగ్గింది, రికవరీ రేటు కూడా రోజురోజుకు మెరుగుపడుతుండటంతో ఆక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతోంది. ఇక కొత్త వేరియంట్ వైరస్ వ్యాప్తి కూడా జరగకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

రాష్ట్రంలోని కేసుల విషయానికి వస్తే,  నిన్న రాత్రి 8 గంటల వరకు 42,485 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 253 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 717 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 70,61,049 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,87,993కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా స్వల్పంగా 61 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, అన్ని జిల్లాల్లోనూ కేసులు గణనీయంగా తగ్గాయి.రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 3 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,554కు పెరిగింది.అలాగే, సోమవారం సాయంత్రం వరకు మరో 317 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో281,400 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,039 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Jan 05, 2021 10:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).