Hyderabad Horror: హైదరాబాద్ లో భయం.. భయం.. గడిచిన 24 గంటల్లో 5 హత్యలు, రెండు హత్యాయత్నాలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొంటున్న నగరవాసులు
హైదరాబాద్ లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లోనే నగరంలో ఐదు హత్యలు, రెండు హత్యాయత్నాలు చోటుచేసుకోవడం పరిస్థితికి అద్దంపడుతున్నది.
Hyderabad, June 20: హైదరాబాద్ లో (Hyderabad) భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లోనే నగరంలో ఐదు హత్యలు (Five Murders), రెండు హత్యాయత్నాలు చోటుచేసుకోవడం పరిస్థితికి అద్దంపడుతున్నది. దీంతో నగరవాసులు భయంభయంగా బతుకుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితంకూడా నగరంలో మూడు హత్యలు జరిగిన విషయం తెలిసిందే.
24 గంటల్లో నగరంలో ఏమేం జరిగాయంటే?
- పాతబస్తీ శాలిబండలో నిమ్రా ఫాస్ట్ ఫుడ్ యజమాని దారుణ హత్యకు గురయ్యారు.
- తుకారాంగేట్ లోని అడ్డగుట్టలో కట్టుకున్న భార్యను భర్త కడతేర్చాడు. కుటుంబ సమస్యలే దీనికి కారణంగా తెలుస్తున్నది.
- అసిఫ్ నగర్ లో అలీం అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు.
- కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలో ఖిజార్ అనే వ్యక్తిని దుండగలు నరికి చంపేశారు.
- సనత్ నగర్ లోని భరత్ నగర్ లో అజార్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు.
- శాలిబండలో వజీద్, ఫకృద్ధీన్ అనే వ్యక్తులపై దుండగులు హత్యాయత్నం చేశారు. అప్రమత్తమైన యువకులు తృటిలో తప్పించుకున్నారు.
(The above story first appeared on LatestLY on Jun 20, 2024 11:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

