Fried Plastic Cover in Chicken Biryani: చికెన్ బిర్యానీలో బాగా ఫ్రై చేసిన ప్లాస్టిక్ కవర్.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే!!
బిర్యానీ అంటే ఠక్కున హైదరాబాద్ పేరే గుర్తొస్తుంది. అయితే, గత కొంతకాలంగా మురిగిపోయినా, పురుగులు పట్టిన మాంసంతో బిర్యానీని వండి వార్చిన హైదరాబాద్ లోని పలు హోటల్ నిర్వాహకులు.. ఇప్పుడు ఏకంగా ఫ్రై చేసిన ప్లాస్టిక్ కవర్ ను కూడా బిర్యానీతో పాటు వడ్డించేశారు.
Hyderabad, July 2: బిర్యానీ (Biryani) అంటే ఠక్కున హైదరాబాద్ (Hyderabad) పేరే గుర్తొస్తుంది. అయితే, గత కొంతకాలంగా మురిగిపోయినా, పురుగులు పట్టిన మాంసంతో బిర్యానీని వండి వార్చిన హైదరాబాద్ లోని పలు హోటల్ నిర్వాహకులు.. ఇప్పుడు ఏకంగా ఫ్రై చేసిన ప్లాస్టిక్ కవర్ ను కూడా బిర్యానీతో పాటు వడ్డించేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని మణికొండకు చెందిన ఓ వ్యక్తి స్విగ్గీలో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా.. మసాలా దట్టించిన చికెన్ పీస్ తో పాటు, బాగా ఉడికిన, ఫ్రై చేసిన ప్లాస్టిక్ కవర్ ను కూడా అదనంగా చేర్చి కస్టమర్ కు అందించారు.
A customer found a fried plastic cover in a chicken biryani ordered through a food delivery app in Manikonda, Hyderabad. #Telangana #Hyderabad #Biryani #PlasticInBiryani #FoodSafety https://t.co/GvdG1vUonj
— Deccan Chronicle (@DeccanChronicle) July 1, 2024
ఆర్డర్ ఎక్కడినుంచి ఇచ్చారంటే?
మసాలా ప్లాస్టిక్ కవర్ తో కూడిన ఈ బిర్యానీని చూసి బిత్తరపోయిన ఆ కస్టమర్ సోషల్ మీడియాలో ఫొటోతో సహా షేర్ చేశాడు. మణికొండకు సమీపంలో ఉండే మెహిఫిల్ రెస్టారెంట్ నుంచి ఈ బిర్యానీ ఆర్డర్ చేసినట్టు బాధితుడు పేర్కొన్నాడు.
(The above story first appeared on LatestLY on Jul 02, 2024 10:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

