Elderly Man Hit by Train: ట్రాక్ దాటుతుండగా వృద్ధుడిని ఢీకొట్టిన ట్రైన్, కిలో మీటర్ల కొద్దీ రైలుకు వేలాడిన మృతదేహం, బీబీనగర్ లో దారుణం
యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్‌లో (Bibinagar) విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి బీబీనగర్ దగ్గర రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ వృద్ధుడిని ప్యాసింజర్ రైలు (Train Hits Old Man) ఢీకొట్టింది. దాంతో వృద్ధుడు రైలు ఇంజిన్‌కు చిక్కుకున్నాడు. ఇది గమనించిన లోకోపైలెట్ అలాగే రైలును పోనిచ్చాడు. దాంతో వృద్ధుడి మృతదేహం ఘట్‌కేసర్ వరకు రైలుకు వేలాడుతూ వచ్చింది.
Bibinagar, July 03: యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్‌లో (Bibinagar) విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి బీబీనగర్ దగ్గర రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ వృద్ధుడిని ప్యాసింజర్ రైలు (Train Hits Old Man) ఢీకొట్టింది. దాంతో వృద్ధుడు రైలు ఇంజిన్‌కు చిక్కుకున్నాడు. ఇది గమనించిన లోకోపైలెట్ అలాగే రైలును పోనిచ్చాడు. దాంతో వృద్ధుడి మృతదేహం ఘట్‌కేసర్ వరకు రైలుకు వేలాడుతూ వచ్చింది. ఘట్‌కేసర్ రైల్వే గేటు దగ్గర రైలుకు వేలాడుతున్ (Dragged Dead Body To Ghatkesar)న వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
దాంతో రైల్వే పోలీసులు ఘట్‌కేసర్ దాటిని తర్వాత రైలును ఆపి మృతదేహాన్ని తొలగించారు. రైలు వరంగల్ నుంచి సికింద్రాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(The above story first appeared on LatestLY on Jul 03, 2024 02:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

