Kolikapudi Srinivasa Rao (Photo-Video Grab)

Vjy, July 2:  సినిమాల్లో విలన్‌ సీన్లను తలపించేలా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ వ్యవహారం సాగింది. ఎ.కొండూరు మండలం కంభపాడులో నిర్మాణంలో ఉన్న వైయస్సార్‌సీపీ ఎంపీపీ భవనం కూల్చివేతకు బుల్డోజర్‌ను వెంటపెట్టుకుని టీడీపీ కార్యకర్తలతో ఎమ్మెల్యేర్యాలీగా వెళ్లారు. పోలీసులను పక్కకు నెట్టేసి భవనంలో కొంత భాగం కూల్చివేశారు. తర్వాత కార్‌పైకి ఎక్కి… సినిమా సీన్లను తలపించేలా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ ప్రవర్తించారు.  రూ.7000కు బదులు రూ.6,500 పెన్షన్, రూ. 500 నొక్కేస్తున్నారని మహిళ చెబుతున్న వీడియో వైరల్

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఓవరాక్షన్‌పై తిరువూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి నల్లగట్ల స్వామిదాస్‌ మండిపడ్డారు. కొలికపూడి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని జేసీబీతో భవన నిర్మాణాన్ని కూల్చారు. కొత్త సంస్కృతికి తెరతీశారు. గతంలో తిరువూరులో కానీ రాష్ట్రంలో కానీ ఇలాంటి సంస్కృతి లేదు. ఎమ్మెల్యే చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కంభంపాడులోని ఎంపీపీకి చెందిన భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయి. నిబంధనలకు అనుగుణంగానే భవనం నిర్మాణం జరిగింది’’ అని స్వామిదాస్‌ చెప్పారు.

Here's Videos

న్యాయపరంగా మేం పోరాడతాం. గడచిన 30 ఏళ్లలో తిరువూరులో ఎన్నడూ ఇలాంటి ఘటన చూడలేదు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్లుంది కొలికపూడి తీరు.. ఆయన పద్ధతి మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో నిలబెడతాం’’ అని స్వామిదాస్‌ హెచ్చరించారు.