Vaccination Drive in TS: తెలంగాణలో ఇప్పటివరకు 1,88,097 మంది హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ పూర్తి, నేటితో ముగియనున్న తొలి విడత టీకాల పంపిణీ, రాష్ట్రంలో ప్రస్తుతం 1964 ఆక్టివ్ కేసులు

రాష్ట్రంలో 1,76,728 మంది ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది ఉన్నారు, వీరిలో 64 శాతం మంది టీకా వేయించుకున్నారు. ఇక ఈరోజుతో హెల్త్ కేర్ సిబ్బందికి కోవిడ్ టీకాలు వేయడం ముగుస్తుంది, రేపట్నించి ఫిబ్రవరి 15 వరకు రెండో విడత వ్యాక్సినేషన్ లో భాగంగా పోలీసులు, రెవెన్యూ, పురపాలక మరియు పంచాయితీ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు....

Vaccination Drive in TS: తెలంగాణలో ఇప్పటివరకు 1,88,097 మంది హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ పూర్తి, నేటితో ముగియనున్న తొలి విడత టీకాల పంపిణీ, రాష్ట్రంలో ప్రస్తుతం 1964 ఆక్టివ్ కేసులు
Vaccine | Representational Image | (Photo Credits: Flickr)

Hyderabad, February 5: తెలంగాణలో నేటితో తొలివిడత కోవిడ్ -19 వ్యాక్సినేషన్ ముగియనుంది. ఇప్పటివరకు టీకాలు అందుకున్న హెల్త్ కేర్ వర్కర్ల సంఖ్య 1,88,097కు పెరిగింది, నిన్న గురువారం 11,547 మంది ప్రైవేట్ హెల్త్ కేర్ సిబ్బంది టీకా తీసుకున్నారు. అయితే టీకా కోసం రిజిస్టర్ చేసుకున్న వారిలో కేవలం 44.3 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

ఫిబ్రవరి 4 నాటికి రాష్ట్రంలో టీకా కోసం పేరు నమోదు చేసుకున్న మొత్తం 1,54,396 మంది ప్రైవేట్ హెల్త్‌కేర్ వర్కర్లలో కేవలం 69,684 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. అంటే 45 శాతం మాత్రమే లబ్ది పొందారు. అంతకుముందు 1,09,161 ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రంలో 1,76,728 మంది ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది ఉన్నారు, వీరిలో 64 శాతం మంది టీకా వేయించుకున్నారు. ఇక ఈరోజుతో హెల్త్ కేర్ సిబ్బందికి కోవిడ్ టీకాలు వేయడం ముగుస్తుంది, రేపట్నించి ఫిబ్రవరి 15 వరకు రెండో విడత వ్యాక్సినేషన్ లో భాగంగా పోలీసులు, రెవెన్యూ, పురపాలక మరియు పంచాయితీ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు.

ఇక రాష్ట్రంలో కరోనా కేసుల విషయానికి వస్తే,  నిన్న రాత్రి 8 గంటల వరకు 37,387 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 169 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 858 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,95,270కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 31 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  మేడ్చల్ నుంచి 11 మరియు రంగారెడ్డి నుంచి 8  కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

అలాగే గత 24 గంటల్లో మరొక కోవిడ్ మరణం సంభవించడంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,607కు పెరిగింది. అలాగే, గురువారం సాయంత్రం వరకు మరో 189 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,91,699 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1964 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Feb 05, 2021 09:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).