Betting On Telangana Elections: తెలంగాణ ఎన్నికలపై కోట్లలో బెట్టింగ్, కాయ్ రాజా కాయ్‌ అంటున్న పందెం రాయుళ్లు, పలు నియోజకవర్గాలపై నెలకొన్న ఆసక్తి

ఇప్పటికే కోట్ల రూపాయల మేర బెట్టింగులు కాశారు. నవంబరు 30 వతేదీ పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ ఫలితాలు (Exit polls) వెలువడే అవకాశం ఉన్నందున డిసెంబర్ 3వతేదీ ఓట్ల లెక్కింపు తేదీ వరకు బెట్టింగ్ లు 9 కోట్ల రూపాయలు దాటుతాయని బెట్టింగ్ రాయుళ్లు చెబుతున్నారు.

Betting On Telangana Elections: తెలంగాణ ఎన్నికలపై కోట్లలో బెట్టింగ్, కాయ్ రాజా కాయ్‌ అంటున్న పందెం రాయుళ్లు, పలు నియోజకవర్గాలపై నెలకొన్న ఆసక్తి
Polling (Photo-PTI)

Hyderabad, NOV 29: కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ రాయుళ్లు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై (Telangana Elections) పందాలు కాస్తున్నారు. కాదేది అనర్హం అన్నట్లు బెట్టింగులకు క్రికెట్ మ్యాచ్‌లే కాదు తెలంగాణ ఎన్నికలపై కూడా బెట్టింగ్ రాయుళ్లు దృష్టి సారించారు. కీలకమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం (Telangana Elections) ముగిసి పోలింగ్ పర్వం గురువారం జరగనుండటంతో బెట్టింగ్ రాయుళ్లు వివిధ రాజకీయ పార్టీల విజయాలపై జోరుగా పందాలు కాస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు ఆంధ్రప్రదేశ్, దేశంలోని ఇతర నగరాలు, విదేశాల్లో సైతం తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్ (Betting) హవా సాగుతోంది. దేశవ్యాప్తంగా అంతటా తెలంగాణ ఎన్నికల గురించి ప్రజలు చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఎన్నికల ముఖచిత్రం గురించి, వివిధ పార్టీల ప్రచారం, నేతల పంచ్ డైలాగులపై సోషల్ మీడియాలో వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ ఎన్నికలపై బుకీలు బెట్టింగ్ దందాను ప్రారంభించారని సమాచారం.

Telangana Assembly Election 2023: తెలంగాణలో 144 సెక్షన్ అమల్లోకి, ముగిసిన ఎన్నికల ప్రచారం, నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు, అసెంబ్లీ ఎన్నికలు-2023 అప్‌డేట్స్ ఇవిగో.. 

ఇప్పటికే కోట్ల రూపాయల మేర బెట్టింగులు కాశారు. నవంబరు 30 వతేదీ పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ ఫలితాలు (Exit polls) వెలువడే అవకాశం ఉన్నందున డిసెంబర్ 3వతేదీ ఓట్ల లెక్కింపు తేదీ వరకు బెట్టింగ్ లు 9 కోట్ల రూపాయలు దాటుతాయని బెట్టింగ్ రాయుళ్లు చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెట్టింగ్ రాయుళ్లు నెలరోజుల క్రితమే పందాలు కాశారని ఓ మాజీ పోలీసు అధికారి చెప్పారు. హైదరాబాద్ నగరం కంటే కూడా ఇతర ప్రాంతాల్లో ఈ పందాలు జోరుగా సాగుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో బయటి ప్రాంతాల్లో బుకీలు పాగా వేసి బెట్టింగ్ దందా ప్రారంభించారని సమాచారం. ముంబయి,ఢిల్లీ, కోల్ కతాతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నగరాల్లో తెలంగాణ ఎన్నికల పందాలు సాగుతున్నట్లు వెల్లడైంది. విదేశాల్లోని లండన్, అమెరికా ప్రాంతాల నుంచి కూడా బుకీలు ఆన్ లైన్ యాప్ ద్వారా పందాలు కాస్తున్నారు. కోడి పందాలకు కేంద్రమైన భీమవరం పట్టణంలో తెలంగాణ ఎన్నికలపై పందాలు లక్షల్లో సాగుతున్నాయి.

ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆంధ్రప్రదేశ్ బెట్టింగ్ రాయుళ్లు తెలంగాణ నేతలు, వ్యాపారులతోనూ పందాలు కాస్తున్నారు. ఓ బడా వ్యాపారి కోట్ల రూపాయల్లోనే పందెం కాశారని బెట్టింగ్ రాయుళ్లు చెబుతున్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని కొందరు పందాలు కాస్తున్నారు. మరికొందరు కాంగ్రెస్ పక్షాన కూడా బెట్టింగులు కాస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ ఎన్నికల అంశం దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది డిసెంబరు 3వతేదీ ఓట్ల లెక్కింపు తేదీ వరకు వేచి చూడాల్సిందే.

(The above story first appeared on LatestLY on Nov 29, 2023 09:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).