Election Commission of India. (Photo Credit: Twitter)

Hyd, Nov 28: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. 2023 సాధారణ ఎన్నికల ప్రచార ఘట్టం నవంబర్-28న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడింది.స్థానికేతరులు నియోజకవర్గాలు విడిచి వెళ్లాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. 119 నియోజకవర్గాలల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈనెల 30న ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ ముగిసే సమయానికి 48 గంటల ముందే ప్రచారం ముగించాల్సిందేనన్న నిబంధన ఉంది.

తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ముందుగానే ఎన్నికల ప్రచారం ముగిసింది. 13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగిసింది. ముఖ్యంగా.. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో 4 గంటలకు ప్రచారం ముగిసిందని ఎన్నికల కమిషన్ తెలిపింది.

ఒవైసీ, మోదీ ఇద్దరి మధ్య రహస్య సంబంధం, వారిద్దరికీ ఈ అవినీతిపరుడైన కేసీఆర్ తోడు, ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ

నవంబర్ 30 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా.. డిసెంబర్‌-03 న కౌంటింగ్‌ జరగనుంది. పోలింగ్‌కు ఇక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రలోభాల పంపిణీపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. ఓ వైపు పోల్‌ మెనేజ్‌మెంట్‌కు ఏర్పాట్లు చేసుకుంటూ.. మరోవైపు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాయని సమాచారం.

ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఇప్పటి నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీవీ, సోషల్ మీడియాలో ప్రకటనలకు అనుమతి లేదు. పత్రిక్లల్లో వేసే ప్రకటనలకు కూడా మోడల్ కోడ్ మీడియా ముందస్తు అనుమతి ఉండాలి. ప్రచారాలకు వేరే నియోజకవర్గాల నుంచి వచ్చిన వారు స్థానికంగా ఉండకూడదు. ఇతర ప్రాంతాల వారు అక్కడి నుంచి వెళ్లిపోవాలి. రేపు, ఎల్లుండి ఎన్నికలకు సంబంధించి రాజకీయ నాయకులు ఇంటర్వ్యూలు ఇవ్వరాదు. బల్క్ ఎస్ఎంఎస్ లు పంపకూడదు.

ఇందిరమ్మ రాజ్యమంతా ఎన్‌కౌంటర్లే, వరంగల్ బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పార్టీపై మండిపడిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని సీపీ సందీప్ శాండిల్య తెలపారు. ఎన్నికల ముగిసే వరకు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని పేర్కొన్నారు. మూడు రోజులపాటు మద్యం అమ్మకాలు నిలిపివేస్తూ హైదరాబాద్ సీపీ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముగిసేవరకు 144 సెక్షన్ కొనసాగుతుందని సీపీ వెల్లడించారు. ఐదుగురికి మించి ఎక్కడైనా గుమ్మిగడితే చర్యలు తప్పవని సీపీ తెలిపారు. బార్లు, వైన్ షాపులు, పబ్బులు మూసివేయాలని సీపీ ఆదేశాలు ఇచ్చారు. మూడు రోజులపాటు మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023 అప్‌డేట్స్

స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలని ఈసీ ఆదేశం

ఈనెల 30న పోలింగ్‌, డిసెంబర్‌ 3న కౌంటింగ్‌

119 అసెంబ్లీ స్థానాలకు బరిలో 2,290 అభ్యర్థులు

ఈసారి ఎన్నికల బరిలో 221 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్‌

రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3 కోట్ల 26 లక్షలు

కోటి 63 లక్షల 1,705 మంది మహిళా ఓటర్లు

కోటి 62 లక్షల 92వేల 418 మంది పురుష ఓటర్లు

2,676 మంది ట్రాన్స్‌జెండర్లు

రాష్ట్రంలో మొత్తం 35,655 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు

12వేల పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తింపు

తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న 9 లక్షల 99వేల 667 మంది