Bhadradri Kothagudem: పాల్వంచ కుటుంబం సజీవదహనం కేసులో కొత్త ట్విస్ట్, ఎమ్మెల్యే కుమారుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు, పరారీలో నిందితుడు, సూసైడ్ లెటర్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం సజీవ దహనం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పాల్వంచ ఏఎస్పీ వెల్లడించారు.

Bhadradri Kothagudem: పాల్వంచ కుటుంబం సజీవదహనం కేసులో కొత్త ట్విస్ట్, ఎమ్మెల్యే కుమారుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు, పరారీలో నిందితుడు, సూసైడ్ లెటర్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు
Representational Image | (Photo Credits: PTI)

Palvancha, Jan 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం సజీవ దహనం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పాల్వంచ ఏఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం రాఘవేందర్‌ పరారీలో ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. సూసైడ్ లెటర్‌లో రామకృష్ణ తల్లి సూర్యవతి, అక్క మాధవీ పేర్లు కూడా ఉన్నాయనీ.. ఘటనపై పూర్తి విచారణ జరుగుతుందని ఎఎస్పీ తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం పాత పాల్వంచ తూర్పు బజారులో ఇంట్లో గ్యాస్ లీకేజీతో రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతులతో సహా కుమార్తె సాహిత్య(12) సజీవదహనమయ్యారు. మంటలు అంటుకొని మరో కుమార్తె సాహితికి తీవ్రగాయాలయ్యాయి. చిన్నారిని పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి భద్రాద్రి కొత్తగూడెంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారికి 80శాతం కాలిన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.

తొలుత ఘటనను ప్రమాదవశాత్తూ జరిగిందని సమాచారం అందినా.. తమకు అందిన ప్రాథమిక సమాచారంతో దీన్ని ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్‌ టీమ్‌ రామకృష్ణ కారులోని కొన్ని కీలక పత్రాలు, బిల్లులను స్వాధీనం చేసుకుంది.

(The above story first appeared on LatestLY on Jan 03, 2022 09:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).