Chaderghat Incident: చాదర్‌ఘాట్ ఆటోలో అసభ్యకర ఘటన.. మైనర్ నిందితుడికి నెల రోజుల పాటు సామాజిక సేవ శిక్ష విధించిన జువైనల్ జస్టిస్ బోర్డు
Chaderghat Incident: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ వంతెనపై ఆటోలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైరల్ ఘటన కేసులో నాంపల్లి జువైనల్ జస్టిస్ బోర్డు (JJB) కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడైన మైనర్‌కు నెల రోజుల పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించింది.
Chaderghat Incident: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ వంతెనపై ఆటోలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైరల్ ఘటన కేసులో నాంపల్లి జువైనల్ జస్టిస్ బోర్డు (JJB) కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడైన మైనర్‌కు నెల రోజుల పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. బాల నేరస్థుడిలో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందించడం, అతనికి సరైన పునరావాసం కల్పించడమే లక్ష్యంగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు ప్రకారం.. సదరు మైనర్ నిందితుడు నెల రోజుల పాటు రోజూ ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు జువైనల్ జస్టిస్ బోర్డు కార్యాలయంలో సామాజిక సేవ చేయాల్సి ఉంటుంది.
గత ఏడాది నవంబర్ 7వ తేదీ రాత్రి చాదర్‌ఘాట్ వంతెనపై వెళ్తున్న 'TG05T4061' నంబర్ ఆటోలో ఈ అసభ్యకర ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు 'X' (ట్విట్టర్)లో ప్రత్యక్షమై వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. వీడియోలో చాదర్‌ఘాట్ వంతెనపై ఒక యువకుడు.. మహిళను తన ఒడిలో అసభ్యకరంగా కూర్చోబెట్టుకుని ఆటోరిక్షా నడుపుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, స్థానికుల నుంచి నిరసనలు వ్యక్తమయింది. పెట్రోల్ కార్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో చాదర్‌ఘాట్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో నిందితుడు మైనర్ అని గుర్తించడంతో అతడిని నాంపల్లి జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. విచారణ పూర్తి చేసుకున్న బోర్డు సామాజిక సేవ శిక్షను ఖరారు చేసింది. తదుపరి న్యాయపరమైన చర్యల కోసం కేసు ఫైల్‌ను 5వ VACJM కోర్టుకు సమర్పించినట్లు చాదర్‌ఘాట్ ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు. ఈ తీర్పు బాల నేరస్థులలో మార్పు తీసుకురావడానికి, జువైనల్ న్యాయ వ్యవస్థ ఆశయాలకు అద్దం పడుతోందని న్యాయవర్గాలు వ్యాఖ్యానించాయి.
(The above story first appeared on LatestLY on Jul 24, 2026 10:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

