Woman Raped In Moving Bus: ప్రైవేటు బస్సులో చివరి సీట్లో పడుకున్న మహిళపై డ్రైవర్ రేప్, బస్సు నిండా ప్రయాణికులు, అయినా లైంగిక దాడికి పాల్పడిన మృగాడు..

కదులుతున్న బస్సులో డ్రైవర్ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలంగాణలోని సూర్యాపేట సమీపంలో జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్న ప్రైవేటు బస్సులో ఒంటరిగా ఉన్న మహిళపై డ్రైవర్ అత్యాచారం చేయగా.. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

Woman Raped In Moving Bus: ప్రైవేటు బస్సులో చివరి సీట్లో పడుకున్న మహిళపై డ్రైవర్ రేప్, బస్సు నిండా ప్రయాణికులు, అయినా లైంగిక దాడికి పాల్పడిన మృగాడు..
Rape | Representational Image (Photo Credits: Pixabay)

హైదరాబాద్, ఫిబ్రవరి 27: కదులుతున్న బస్సులో డ్రైవర్ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలంగాణలోని సూర్యాపేట సమీపంలో జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్న ప్రైవేటు బస్సులో ఒంటరిగా ఉన్న మహిళపై డ్రైవర్ అత్యాచారం చేయగా.. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 28 ఏళ్ల మహిళ హైదరాబాద్‌లో బేబీ కేర్ టేకర్‌గా పనిచేస్తోంది. ఆమెకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో విభేదాలు రావడంతో.. వేర్వేరుగా నివసిస్తున్నారు. ఆమె మాదాపూర్‌లో తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నివసిస్తోంది. ఐతే ఫిబ్రవరి 23న సొంతూరికి వెళ్లేందుకు కూకట్‌పల్లిలో ఓ ప్రైవేట్ బస్సు ఎక్కింది. ఆమెకు చివరి సీటు కేటాయించారు. బస్సులో తక్కువ మందే ప్రయాణికులు ఉండడంతో చివర్లో ఈమె ఒంటరిగా ఉంది. అప్పటికే రాత్రి 10 దాటడంతో అందరితో పాటు ఆమె కూడా నిద్రపోయింది.

Indians in Ukraine: భారతీయులు జాగ్రత్తగా ఉండండి, ఎవ‌రూ ఏ దేశ స‌రిహ‌ద్దుల వైపు వెళ్లొద్ద‌ు, హెచ్చరించిన ఉక్రెయిన్‌ ఎంబ‌సీ అధికారులు, ఉక్రెయిన్ నుంచి వ‌చ్చే విద్యార్థుల‌కు ముంబై ఎయిర్ పోర్టులో ఆర్టీపీసీఆర్ టెస్టులు

బస్సుకు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ఒకరు బస్సు నడుపుతుండగా.. మరొక డ్రైవర్ రాజేశ్ (35) విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఐతే బస్సు సూర్యాపేట దాటగానే.. ఆ బస్సు డ్రైవర్ వెనక సీట్లోకి వచ్చాడు. అప్పటికే బస్సులో ఉన్న ప్రయాణికులంతా నిద్రపోయారు. చివరి సీట్లో ఉన్న ఆ మహిళ కూడా నిద్రపోయింది. డ్రైవర్ ఆమె వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె మెలకువ వచ్చి గట్టిగా అరిచే ప్రయత్నం చేసింది. కానీ అతడు నోటికి అడ్డంగా చేయి ఉంచి.. బెదిరించాడు. అరిస్తే చంపేస్తానని హెచ్చరించడంతో ఆమె అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత డ్రైవర్ ఆమెను అత్యాచారం చేశాడు. ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలోని తన స్థలం రాగానే ఆమె దిగిపోయింది. ఐతే బస్సు దిగుతున్న సమయంలో తనను బెదిరించి.. రూ.7వేలు కూడా లాక్కున్నాడని బాధితురాలు కన్నీరుపెట్టుకుంది.

ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన విషయం కుటుంబ సభ్యులకు వివరించింది. తన బంధువులతో కలిసి మళ్లీ హైదరాబాద్‌కు వచ్చి కూకట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. శనివారం ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచారం, దౌర్జన్యం కేసులు నమోదు చేసినట్లు సీఐ నర్సింగ్ రావు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె బంధువలు ఆందోళనకు కూడా దిగారు.

(The above story first appeared on LatestLY on Feb 27, 2022 05:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).