Indians in Ukraine: భారతీయులు జాగ్రత్తగా ఉండండి, ఎవ‌రూ ఏ దేశ స‌రిహ‌ద్దుల వైపు వెళ్లొద్ద‌ు, హెచ్చరించిన ఉక్రెయిన్‌ ఎంబ‌సీ అధికారులు, ఉక్రెయిన్ నుంచి వ‌చ్చే విద్యార్థుల‌కు ముంబై ఎయిర్ పోర్టులో ఆర్టీపీసీఆర్ టెస్టులు
Indian Embassy in Kyiv. (Photo Credits: ANI) New Delhi, February 26:

New Delhi, February 26: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం శనివారానికి మూడో రోజుకు చేరింది. రాజధాని కీవ్‌ వైపు రష్యా దళాలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఇరుక్కుపోయిన భార‌తీయ విద్యార్థుల‌ను (Indians in Ukraine) వెన‌క్కి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయి. 219 మందితో రొమేనియా నుంచి భార‌త విమానం తిరుగుప్ర‌యాణ‌మైంది. మ‌రో విమానాన్ని కూడా అధికారులు పంప‌నున్నారు. ఉక్రెయిన్‌లోని భార‌తీయులు క్షేమంగా తీసుకొస్తామ‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం కూడా లేద‌ని ప్ర‌భుత్వం తేల్చి చెబుతోంది.

ఎంబ‌సీ అధికారులు ( Indian Embassy in Kyiv) భార‌తీయులు అత్యంత అప్ర‌మ‌త్త‌త‌తో ఉండాల‌ని సూచించారు. త‌మ సూచ‌న‌లు తీసుకోకుండా, వాటికి విరుద్ధంగా ఎవ‌రూ ఏ దేశ స‌రిహ‌ద్దుల వైపు వెళ్లొద్ద‌న స్ప‌ష్టం చేశారు. అక్క‌డి ఎంబ‌సీ అధికారుల సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని సూచించింది. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడులు (Russia Ukraine Crisis,) మ‌రింత పెరుగుతున్న నేప‌థ్యంలో ఉక్రెయిన్‌లోని భార‌త ఎంబసీ తాజాగా ఈ సూచ‌న‌లు చేసింది. ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్‌లో ఉంటున్న భార‌తీయులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, వారి వారి స్థానాల్లోనే ఉండిపోవాల‌ని, లేదంటే… షెల్ట‌ర్ల‌లో త‌ల‌దాచుకోవాల‌ని సూచించింది.

భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చిన యుద్ధం, రష్యా దాడిలో 198 మంది సామాన్య పౌరులు మృతి, వారిలో ముగ్గురు చిన్నారులు, 1115 మందికి గాయాలు, క్షతగాత్రుల్లో 33 మంది పిల్లలు

ఉక్రెయిన్‌లోని భార‌తీయులంద‌రూ త‌గిన స‌ల‌హాలు, సూచ‌న‌లు లేకుండా స‌రిహ‌ద్దులు దాటొద్దు. భార‌త ఎంబ‌సీ అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు సూచ‌న‌లు చేస్తూనే వుంటారు. ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్ల‌ను కూడా ఇప్ప‌టికే ప్ర‌క‌టించాం. జాగ్రత్త‌గా ఉండండి అంటూ ఉక్రెయిన్‌లోని భార‌త ఎంబ‌సీ సూచించింది.

ఉక్రెయిన్ నుంచి భార‌త్‌కు వ‌చ్చే విద్యార్థులంద‌రికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వ‌హిస్తామ‌ని ముంబై ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు సిబ్బంది ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఎయిర్‌పోర్టు స్పెష‌ల్ కారిడార్‌ను మూసివేశామ‌ని పేర్కొన్నారు. ఉక్రెయిన్ నుంచి వ‌చ్చే విద్యార్థులు త‌ప్ప‌నిస‌రిగా కొవిడ్ వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ లేదా నెగిటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్టు చూపించాల‌ని తెలిపారు. ఒక వేళ ఈ రెండు ప‌త్రాలు చూపించ‌ని యెడ‌ల‌, అలాంటి విద్యార్థుల‌కు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఆ ఖ‌ర్చు ఎయిర్‌పోర్టు అధికారులే భ‌రిస్తార‌ని చెప్పారు. ఈ ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ వ‌చ్చిన విద్యార్థులు త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిపోవ‌చ్చు. ఒక వేళ ఎవ‌రికైనా పాజిటివ్ అని తేలితే.. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం స‌ద‌రు వ్య‌క్తిని క్వారంటైన్‌లో ఉంచుతామ‌ని ప్ర‌క‌టించారు.