Russia-Ukraine War: భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చిన యుద్ధం, రష్యా దాడిలో 198 మంది సామాన్య పౌరులు మృతి, వారిలో ముగ్గురు చిన్నారులు, 1115 మందికి గాయాలు, క్షతగాత్రుల్లో 33 మంది పిల్లలు
Russian and Ukraine flags (Photo Credits: Pxhere/Pixabay)

New Delhi, February 26: ఉక్రెయిన్ పై రష్యా పంజా విసిరుతోంది. బాంబులతో (Russia-Ukraine War) విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ పై దురాక్రమణ మొదలుపెట్టిన రష్యా దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది. గత గురువారం సైనిక చర్య మొదలుపెట్టగా ప్రస్తుతం రష్యన్ బలగాలు రాజధాని కీవ్ ను హస్తగతం చేసుకునేందుకు (Street Fighting Erupts in Kyiv) తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తొలుత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని రష్యా ప్రకటించినా..సాధారణ పౌరులు జనావాసాలపైన దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 198 మంది సామాన్య పౌరులు (198 Killed in Russian Invasion) మరణించినట్లు ఉక్రెయిన్ తాజాగా వెల్లడించింది.

గత రెండు రోజుల్లో రష్యా దాడిలో 198 మంది పౌరులు మరణించారు. వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 1115 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలొ 33 మంది పిల్లలు ఉన్నారని ఉక్రెయిన్ ఆర్థిక మంత్రి వెల్లడించారు. అయితే ఇది కేవలం సామాన్య పౌరుల లెక్కలే. యుద్ధంలో సైనికులు ఎంతమంది మరణించారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. నిన్న నల్లసముద్రంలో ఉక్రెయిన్ కు చెందిన స్నేక్ దీపంలో 13 మంది బోర్డర్ గార్డ్స్ సిబ్బందిని రష్యా చంపివేసింది.

నేను ఇక్కడే ఉన్నా: ఉక్రెయిన్ ప్రెసిడెంట్, అధ్యక్ష భవనం నుంచి సెల్ఫీ వీడియో, మిటలరీతో పాటూ ఉన్నానంటూ భరోసా, రష్యాపై ఆరోపణలు

రష్యా సైన్యాన్ని కూడా ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కుంటోంది. శత్రుదేశానికి చెందిన వేలాది మంది సైనికులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. యుద్ధంలో ఇప్పటివరకు 3500 మంది వరకు రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ ఆర్మీ వెల్లడించినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రష్యాకు చెందిన 15 విమానాలు, 8 హెలికాప్టర్లు, 102 ట్యాంకులు, 536 సాయుధ వాహనాలు, 15 ఆర్టిల్లెరీ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ తెలిపింది.