CM Revanth Reddy Review on Panchayat Raj: గ్రామ పంచాయతీల్లో పనిచేసే ఉద్యోగులకు గుడ్ న్యూస్, వారి జీతాలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల (Govt Employees) తరహాలో ఇకపై నెల నెలా చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revath Reddy) ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో 92,351 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి ప్రతి నెలా రూ.116 కోట్లు జీతాలు చెల్లించాల్సి ఉంది.
Hyderabad, JAN 09: తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల (Govt Employees) తరహాలో ఇకపై నెల నెలా చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revath Reddy) ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో 92,351 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి ప్రతి నెలా రూ.116 కోట్లు జీతాలు చెల్లించాల్సి ఉంది. వీరందరికీ జీతాల చెల్లింపులో ఆలస్యం కాకుండా స్పష్టమైన విధానం అనుసరించాలని పంచాయతీరాజ్(Panchayat Raj), ఆర్థికశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. గ్రీన్ ఛానెల్‌లో వీరికి జీతాలు చెల్లించాలని చెప్పారు. గురువారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పంచాయతీరాజ్(Panchayat Raj), గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం బిల్లులను త్వరగా చెల్లించాలని ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి దాదాపు 1.26లక్షల ఉపాధి పనులు జరిగాయని, వీటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదల అయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రాబట్టుకోవాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు.
(The above story first appeared on LatestLY on Jan 09, 2025 10:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

