ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దాదాపు ఆరున్నర గంటల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. తన లాయర్ రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.కేటీఆర్‌ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతీరాజ్, అడిషనల్ ఎస్పీ శివరాం శర్మ, డీఎస్పీ మాజీద్ ఖాన్ విచారించారు.
ఇది ఒక చెత్త కేసు. రాజకీయ ఒత్తిడితో మీరు ఏం చేస్తున్నారో కూడా మీకే తెలియడంలేదు, పూర్తిగా అసంబద్ధమైన కేసు అని అధికారులకు చెప్పాను. నాలుగైదు ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు.. కొత్తగా అడిగిందేమీ లేదు. పైసలు పంపాను అని నేనే చెబుతున్నాను.. డబ్బులు వచ్చాయని వాళ్ళు చెబుతున్నారు. ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందని అడిగా’’ అని కేటీఆర్ తెలిపారు.ఏసీబీ ఆఫీసులో ముగిసిన కేటీఆర్ విచారణ, దాదాపు ఆరున్నర గంటల పాటు సాగిన విచారణ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏమన్నారంటే..
ACB Questions to KTR six and a half hours on E Race Case
రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగు ప్రశ్నలను పట్టుకొని తిప్పి తిప్పి 40 ప్రశ్నలు అడిగారు.
డబ్బులు ఇచ్చానని నేను అంటున్నాను, తీసుకున్నామని వారు చెబుతున్నారు ఇందులో అవినీతి ఎక్కడుందని అడిగే సరికి నీళ్లు మింగుతున్నారు.
~ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ pic.twitter.com/9uAi5a64p2
— 𝐆𝐮𝐦𝐩𝐮 𝐌𝐞𝐬𝐭𝐫𝐢 (@gumpumestri) January 9, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)