జగిత్యాల జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు కోరుట్ల ఎస్సై శంకరయ్య. ఓ వ్యక్తి నుంచి కేసు రాజీ కోసం 5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఎసిబి డీఎస్పీ రమణ మూర్తి. పేకాట ఆడుతూ పట్టుబడ్డ 8 మందిని పట్టుకుని కేసు నమోదు చేస్తానని తెలపడంతో 5 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.ఇక రెండు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ( Registration Office ) సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు (ACB Raids ) నిర్వహించారు. ఓ వ్యక్తి వద్దనుంచి లంచం తీసుకున్న సబ్ రిజిస్ట్రార్‌ను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని కవితా కాంప్లెక్స్ రెండవ అంతస్తులో ఉన్న జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం ఉదయం ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి కి సంబంధించిన ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ శ్రీరామరాజును సదరు వ్యక్తి వద్ద నుంచి రూ. 10 వేలు లంచం తీసుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు రిజిస్ట్రేషన్ కార్యాలయంపై దాడి చేసి లంచం డబ్బులతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం తీసుకున్న శ్రీరామరాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Korutla SI Shankaraiah caught red-handed by ACB while taking a bribe
జగిత్యాల జిల్లా :
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్సై శంకరయ్య..
5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎసిబి డీఎస్పీ రమణ మూర్తి..
పేకాట ఆడుతూ పట్టుబడ్డ 8 మందిని పట్టుకుని కేసు నమోదు చేస్తానని తెలపడంతో 5 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసిబి అధికారులు… pic.twitter.com/VT0FkCAnyC
— Telangana Awaaz (@telanganaawaaz) March 5, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)