Hyd, Jan 9: ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దాదాపు ఆరున్నర గంటల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. తన లాయర్ రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.కేటీఆర్‌ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతీరాజ్, అడిషనల్ ఎస్పీ శివరాం శర్మ, డీఎస్పీ మాజీద్ ఖాన్ విచారించారు.
ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘పూర్తి స్థాయిలో ఏసీబీ విచారణకు సహకరించా. నాకున్న అవగాహన మేరకు ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పా. విచారణకు ఎప్పుడు పిలిచినా, ఎన్ని సార్లు పిలిచినా వచ్చి సహకరిస్తానని చెప్పా. మళ్లీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఒక్క ప్రశ్ననే 40 రకాలుగా అడిగారు.. కొత్తగా అడిగిందేమీ లేదన్నారు.