
Hyd, Feb 27: సీఎం రేవంత్ రెడ్డి 8 మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్న విషయం మర్చిపోయి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాడు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao). ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు చెందిన పలువురు నాయకులతో కలిసి SLBC టన్నెల్ ను(SLBC Tunnel Collapse) పరిశీలించే ముందు మాట్లాడి నహరీశ్ రావు.. సీఎం స్థాయి వ్యక్తి ప్రమాదం జరిగిన దగ్గరికి వెళ్లి సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకొని, ముమ్మరం చేయించాలి.. కానీ రేవంత్ రెడ్డి ప్రమాదం గురించే పట్టించుకోవడం లేదు అన్నారు.
ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. అబద్ధాలు మాట్లాడుతాడు కాబట్టి ఆయన అబద్దాల రేవంత్ రెడ్డి అన్నారు. SLBC వెళ్ళేముందు మీడియాతో హరీష్ రావు... SLBC ఘటనలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు(SLBC Tunnel). ప్రమాదం జరగడం దురదృష్టకరం.. ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందన కరువైంది, ముఖ్యమంత్రికిఎన్నికలు ముఖ్యమా? ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా? చెప్పాలన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల ప్రమాదం..6వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్, ఇంతవరకు లభ్యం కానీ 8 మంది ఆచూకీ
ఏజెన్సీల మధ్య సమన్వయం చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా సహాయక చర్యలు మొదలు కాలేదు.. మంత్రులు ఇంటర్వ్యూలు ఇవ్వడంలో పోటీ పడుతున్నారు.. హెలికాప్టర్ నుండి సొరంగంలో ఏం జరుగుతుందో తెలుస్తుందా? చెప్పాలన్నారు.
ఎంత తొందరగా సహాయక చర్యలు మొదలైతే అంత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి సరైన డైరెక్షన్ ఇవ్వలేకపొతున్నారు .. ప్రభుత్వ ఫెయిల్యూర్ కప్పి పుచ్చుకోవడానికి మాపై నెపం నెడుతున్నారు అన్నారు.
Harishrao slams CM Revanth Reddy
SLBC టన్నెల్ ప్రమాద ఘటన జరిగి ఇన్నిరోజులు అవుతున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు
వాళ్లను వేగవంతంగా బైటకు తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది
రాజకీయాలు చేయకుండా వాళ్ల ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తుంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల్ వద్ద కూర్చొని బీఆర్ఎస్ మీద… pic.twitter.com/2RvRHVokED
— Telugu Scribe (@TeluguScribe) February 27, 2025
SLBC సందర్శన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతాను.. SLBC కోసం కాంగ్రెస్ హయాంలో కంటే బీఆర్ఎస్ హయంలోనే ఎక్కువ నిధులు ఖర్చు చేశాం,SLBC కోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి 100 కోట్ల మోబిలైజేశన్ ఫండ్ ఇచ్చాం అన్నారు. రేవంత్ రెడ్డి .. 15 నెలల పాలనలో 15 మీటర్లు కూడా సొరంగాన్ని తవ్వలేదు, రేవంత్ రెడ్డి డిఫెన్స్ లో పడ్డారు.. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు గాలిలో ఉన్నాయి అన్నారు.