Hyd, Jan 9: ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ ఏఏజీ, న్యాయవాది రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్‌కు వెళ్లారు. ఈ కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్.. మాజీ మంత్రిని విచారిస్తున్నారు. ఈ విచారణను జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ పర్యవేక్షిస్తున్నారు.
విచారణను వేరే గది నుంచి చూసేందుకు కేటీఆర్ న్యాయవాదికి ఏర్పాట్లు చేశారు.ముగ్గురు అధికారుల బృందం కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజు, ఎస్పీ నరేందర్, డీఎస్పీ విచారిస్తున్నారు. విచారణ ప్రక్రియలను ఏసీబీ డైరెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ఏసీబీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి.
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఏసీబీ ఆఫీసుకు కేటీఆర్.. 40 ప్రశ్నలతో అధికారులు రెడీ (లైవ్)
అంతకు ముందు కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కార్యకర్తగా, కేసీఆర్ సైనికుడిగా రాష్ట్ర ప్రతిష్ఠ పెంచడానికి, హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలపడానికి మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశా. తెలంగాణ ప్రతిష్ఠ పెంచడానికే ఫార్ములా ఈ-కార్ రేసు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మా బావమరుదులకు వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చుకోలేదు. కాంట్రాక్టులు ఇచ్చి ల్యాండ్ క్రూజర్లు తీసుకోలేదు. నేను అర పైసా అవినీతి కూడా చేయలేదు.
I am KCR's son, will die for Telangana: KTR
నేను కేసీఆర్ సైనికుడ్ని, నిఖార్సైన తెలంగాణ బిడ్డను.
తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్ట కోసం పనిచేశా. నీలా లుచ్చా పనులు చేయలేదు.
తెలంగాణ కోసం చస్తాను తప్ప.. ఇలాంటి లుచ్చాల ముందు తల వంచను.
కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను బయటకు తెచ్చే వరకూ పోరాడుతూనే ఉంటా.
- బీఆర్ఎస్… pic.twitter.com/ZAZ2lfKTRo
— Thirupathi Bandari (@BTR_KTR) January 9, 2025
బురద చల్లి రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుంది. నా మీద కేసు పెట్టి, నన్నేదో చేయాలనుకుంటున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మేము భయపడే ప్రసక్తే లేదు. లుచ్చాగాళ్ల ముందు తలవంచను. ఇంకా ఎన్ని కేసులైనా పెట్టుకో. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. న్యాయపరంగా అన్నింటినీ ఎదుర్కొంటాం.
క్విడ్ ప్రోకో చేయలేదు. ఏ తప్పు చేయలేదు. నీలాగా లుచ్చా పనులు, తుచ్చ పనులు చేయలేదు రేవంత్ రెడ్డీ. నీలాగా అడ్డంగా దొరికిపోయిన దొంగను కాను. నిజం నిలకడ మీద తెలుస్తుంది. కేసీఆర్ కొడుకుగా చెపుతున్నా. తెలంగాణ కోసం అవసరమైతే చచ్చిపోతా" అని కేటీఆర్ అన్నారు.