CM Revanth Reddy On Janwada Farmhouse: జన్వాడ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా?, దానిని కూల్చాలా వద్దా? అని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి..పేదలను రక్షణ కవచాలుగా పెట్టుకుని నాటాకాలా అని ఆగ్రహం
హైడ్రా కూల్చివేతలపై ప్రతిపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్.....జన్వాడ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ? అని ప్రశ్నించారు. హరీశ్ రావు....అజీజ్ నగర్ లో ఉన్న నీ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
Hyd, Oct 3: హైడ్రా కూల్చివేతలపై ప్రతిపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్.....జన్వాడ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ? అని ప్రశ్నించారు. హరీశ్ రావు....అజీజ్ నగర్ లో ఉన్న నీ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
సబితమ్మ పేద అరుపులు వద్దూ......నీకున్న ఫాంహౌస్ ల లెక్కలు కూడా ఉన్నాయన్నారు. మీ ఫాంహౌస్ లు ఎక్కడ కూలిపోతాయోనని భయపడి పేదలను రక్షణ కవచాలుగా పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారు అని మండిపడుతున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ మీరు కట్టుకున్న ఫాంహౌస్ ల నుంచి వచ్చే మురికి నీటి హైదరాబాద్ ప్రజలు తాగాలా ఆలోచించాలన్నారు.
హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరగలేదా..? ఆ రోజు సూచనలు చేసి ఉంటే ఈరోజు అడ్డగోలుగా మాట్లాడే అవకాశం ఉండేది కాదు అన్నారు. పేదలకు ఏం చేయాలో చెప్పండి...మీ తాత సొమ్మొ, మా తాత సొమ్మొ కాదు..ప్రజల సొమ్మును పేదలకు పంచడంలో తప్పేముంది? అని ప్రశ్నించారు. కిరాయి మనుషులను పెట్టి మీరు చేస్తున్న హడావుడిని తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మూసి బాధితుల బతుకమ్మ పాట, ఆకట్టుకుంటున్న రేవంత్ సారూ ఉయ్యాలో సాంగ్..
Here's Video:
కేటీఆర్.....జన్వాడ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ? :రేవంత్ రెడ్డి
హరీశ్ రావు....అజీజ్ నగర్ లో ఉన్న నీ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ?
సబితమ్మ పేద అరుపులు వద్దూ......నీకున్న ఫాంహౌస్ ల లెక్కలు కూడా ఉన్నాయి.
మీ ఫాంహౌస్ లు ఎక్కడ… pic.twitter.com/jDH0GsdLNZ
— BIG TV Breaking News (@bigtvtelugu) October 3, 2024
అధికారం కోల్పోవడంతో విచక్షణ కూడా కోల్పోయి ఏదేదో మాట్లాడుతున్నారు..హైదరాబాద్ నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తుంటే దానిపై కూడా బావబామ్మర్దులు బురద జల్లుతున్నారు అన్నారు. మీ పార్టీ ఖాతాలో తెలంగాణ సొమ్ము రూ.1500 కోట్లు ఉన్నాయి..పేదలపై మీకు అంత ప్రేమ ఉంటే ఒక రూ.500 కోట్లు మూసీ బాధితులకు, పేదలకు ఇవ్వాలన్నారు.
ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే అన్ని సంక్షేమ పథకాలు అందుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై ఫ్యామిలీ డిజిటల్ కార్డే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు,రైతు భీమా కార్డు అన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే ఇందిరమ్మ ఇల్లు, కళ్యాణ లక్ష్మీ అందిస్తామని..ఈ డిజిటల్ కార్డు....మీ కుటుంబానికి రక్షణ కవచం అని తేల్చిచెప్పారు రేవంత్ రెడ్డి.
Here's Video:
ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే అన్ని సంక్షేమ పథకాలు : రేవంత్
ఇకపై ఫ్యామిలీ డిజిటల్ కార్డే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు,రైతు భీమా కార్డు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే ఇందిరమ్మ ఇల్లు, కళ్యాణ లక్ష్మీ.
ఈ డిజిటల్ కార్డు....మీ కుటుంబానికి రక్షణ కవచం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.… pic.twitter.com/tR01p2pDZw
— BIG TV Breaking News (@bigtvtelugu) October 3, 2024
(The above story first appeared on LatestLY on Oct 03, 2024 03:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

