Corning Investment in Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి, భారత్‌లో తొలిసారి గొరిల్లాగ్లాస్ తయారీ కంపెనీ ఇన్వెస్టిమెంట్లు, తెలంగాణలో ఏకంగా రూ. 934 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటన
రాష్ట్రంలో రూ. 934 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కార్నింగ్ కంపెనీ వెల్లడించింది. రాష్ట్రంలో గొరిల్లా గ్లాస్ (Gorilla Glass) తయారీ పరిశ్రమ పెట్టాలని కార్నింగ్ (Corning Company) కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు కార్నింగ్ కంపెనీ ప్రతినిధులతో ఒప్పందం కుదిరిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు.
Hyderabad, SEP 01: రాష్ట్రంలో రూ. 934 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కార్నింగ్ కంపెనీ వెల్లడించింది. రాష్ట్రంలో గొరిల్లా గ్లాస్ (Gorilla Glass) తయారీ పరిశ్రమ పెట్టాలని కార్నింగ్ (Corning Company) కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు కార్నింగ్ కంపెనీ ప్రతినిధులతో ఒప్పందం కుదిరిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు.
Happy to share that Corning, one of the world’s leaders in material sciences has decided to invest in Telangana to setup a manufacturing plant to make Gorilla Glass for smartphones, for the first time in India 😊
Investment size of ₹934 Crore will employ 800 people but more… pic.twitter.com/baYUXByFTl
— KTR (@KTRBRS) September 1, 2023
మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ సంస్థ (Corning Company).. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం గొరిల్లా గ్లాస్‌ను (Corning Gorilla Glass) తయారు చేయడానికి తెలంగాణలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సంస్థ ఏర్పాటుతో 800 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని కేటీఆర్ తెలిపారు.
(The above story first appeared on LatestLY on Sep 02, 2023 12:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

