Representational (Credits: Google)

Vjy, Dec 29: ఏపీలో క్రైమ్‌ రేటు తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మెరుగైన పోలీసింగ్‌తో నేరాలు తగ్గించగలిగామన్నారు. లోక్‌ అదాలత్‌ ద్వారా పెద్ద ఎత్తున కేసులు పరిష్కరిస్తున్నాం. 1.08 లక్షల కేసులు పరిష్కరించాం. చోరీ కేసుల్లో రికవరీ శాతం బాగా పెరిగిందని డీజీపీ పేర్కొన్నారు.

గతేడాది 2,84,753 కేసులు నమోదు కాగా, 2022లో 2,31,359 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2021లో 945 హత్య కేసులు నమోదు కాగా, 2022లో 857 హత్య కేసులు మాత్రమే నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాలు 2021లో 19,203 జరగగా 2022 లో 18739 ప్రమాదాలు జరిగాయి. బ్లాక్ స్పాట్ లను గుర్తించి నివారణా చర్యలు చేపట్టాం.

చంద్రబాబు రోడ్ షో ప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, మృతులకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాలని ఆదేశాలు

కన్విక్షన్ బేస్ పోలింగ్ విధానాన్ని ఈ సంవత్సరం జూన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. ఈ విధానం ద్వారా ప్రతి ఒక్క యూనిట్ అధికారి సీపీ/ ఎస్పీ తమ పరిధిలోని అత్యంత ముఖ్యమైన ఐదు కేసులు(మహిళలకు సంబంధించిన కేసులకు మొదటి ప్రాధాన్యత) పర్యవేక్షణ చేస్తారు’’ అని డీజీపీ వివరించారు.

ప్రతి రోజు షెడ్యూల్ మేరకు కోర్టులో జరుగుతున్న కేసు ట్రైల్ పురోగతిపై సమీక్ష నిర్వహించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశాం ఈ విధానం ద్వారా కేసు ట్రైల్ సమయాన్ని తగ్గించి స్వల్పకాల వ్యవధిలోనే నేరస్తులకు శిక్ష పడేవిధంగా చేయొచ్చు. అంతేకాకుండా ఏ ఒక్క నేరస్థుడు తప్పించుకోకుండా చూడటం ముఖ్య ఉద్దేశం’’ అని రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేటు

తెలంగాణలో క్రైమ్‌ రేట్‌ పెరిగిందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే 4.44 శాతం క్రైం రేట్‌ పెరిగిందన్నారు. సైబర్ క్రైమ్ కేసులు 57 శాతం పెరిగాయి. 2022 లో రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎన్‌కౌంటర్లు జరగాయని, ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారన్నారు. 120 మంది మావోయిస్టులు లొంగిపోగా, వారి నుంచి 14 ఆయుధాలు, 12 లక్షల 65 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ వివరించారు.

కన్విక్షన్ రేట్ 50 నుండి 56 శాతానికి పెరిగింది. 152 మందికి జీవితకాలం శిక్ష పడింది. సీసీ కెమెరాలు ద్వారా 18,234 కేసులు ఛేదించాం. 431 మంది పై పీడీ యాక్ట్ పెట్టి జైలు పంపించాం. రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్కి 6,157 ఫిర్యాదులు వచ్చాయి.. వీటిలో 2,128 కేసులు నమోదు చేశాం. డయల్ 100 కి 13 లక్షల 77 వేళా 113 కాల్స్ వచ్చాయి. ఫింగర్ ప్రింట్స్ ద్వారా 420 కేసులను ఛేదించాం’’ అని పేర్కొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన, పలు దేవాలయాలను సందర్శించిన రాష్ట్రపతి, పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు

‘‘ఈ ఏడాది 762 హత్యకేసులు నమోదయ్యాయి. 2,126 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 1176 డ్రగ్ కేసులు నమోదవ్వగా 2582 నిందితులను అరెస్ట్ చేశాం. మహిళలపై క్రైమ్ కేసులు 17,908 నమోదయ్యాయి. 2432 పొక్సో కేసులు నమోదు. 2022లో 24,127 దోపిడీ కేసులు నమోదయ్యాయి. 148 కోట్ల దోపిడీ జరగగా 74 కోట్లు రికవరీ చేశాం. 19,456 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 6,746 మంది ప్రాణాలు కోల్పోయారు.

మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఒక కోటి 65 లక్షల 84 వేల కేసులు నమోదు చేశాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 612 కోట్ల రూపాయల జరిమానాలు వేశాం. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల 25 వేల సీసీ కెమెరాలున్నాయి. ఈ సంవత్సరం లక్షా 75 వేల కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం’’ అని డీజీపీ వెల్లడించారు.