VC Sajjanar Warns: వింత శబ్దాలతో భయపెట్టేవారికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్, వాహనదారులను ఇబ్బంది పెట్టే వారిపై క్రిమినల్ చర్యలు, మెకానిక్‌లపైనా చర్యలు తప్పవు

వింతశబ్దాలతో తోటి వాహనదారులను భయపెట్టేలా సైలెన్సర్లను అమరుస్తున్న ఆకతాయిలకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ (VC Sajjanar Warns About Silencers) ఇచ్చారు. వెంటనే వీటిని తొలగించాలని ఆదేశించాలు జారీ చేశారు. భయంకరమైన, వింత శబ్దాలు వచ్చే సైలెన్సర్లు అమర్చి తోటి వాహనదారులను ఇబ్బంది పెట్టే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

VC Sajjanar Warns: వింత శబ్దాలతో భయపెట్టేవారికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్, వాహనదారులను ఇబ్బంది పెట్టే వారిపై క్రిమినల్ చర్యలు, మెకానిక్‌లపైనా చర్యలు తప్పవు
Cyberabad CP VC Sajjanar | Photo: ANI

Hyderabad, Feb 13: వింతశబ్దాలతో తోటి వాహనదారులను భయపెట్టేలా సైలెన్సర్లను అమరుస్తున్న ఆకతాయిలకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ (VC Sajjanar Warns About Silencers) ఇచ్చారు. వెంటనే వీటిని తొలగించాలని ఆదేశించాలు జారీ చేశారు. భయంకరమైన, వింత శబ్దాలు వచ్చే సైలెన్సర్లు అమర్చి తోటి వాహనదారులను ఇబ్బంది పెట్టే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

ఇటీవల కాలంలో కొందరు వాహనదారులు, ఆకతాయిలు తమ కార్లు, బైక్‌లకు ఉన్న సైలెన్సర్లను మార్చేస్తున్నారు. వింత శబ్దాలొచ్చే కొత్త రకం సైలెన్సర్లను బిగిస్తున్నారు. అందుకు అధిక మొత్తంలో డబ్బులు వస్తుండటంతో కొందరు మెకానిక్‌లు ఇలాంటి భయంకరమైన సౌండ్స్‌ వచ్చే సైలెన్సర్‌లు బిగిస్తున్నారు. ఆ శబ్దాల వల్ల ఇతర వాహనదారులు, స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో డబ్బు ఆశతో ఇలాంటి సైలెన్సర్లు అమరుస్తున్న మెకానిక్‌లపైనా చర్యలు తప్పవన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సైలెన్సర్లు వాడేది కాలుష్యాన్ని తగ్గించడానికనీ, దానిని పెంచేందుకు కాదని పేర్కొన్నారు. ఈ మేరకు సైలెన్సర్లపై అవగాహన పెంచేందుకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు. అలాంటి పరిస్థితులను కల్పించే వాహనదారులపై ఉక్కుపాదం మోపనున్నట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ (Cyberabad CP VC Sajjanar) తెలిపారు.కాగా. ‘‘సైలెన్సర్లు వాడేది కాలుష్యం తగ్గించడానికే.. శబ్ద కాలుష్యం చేయడానికి కాదు’’ అని సోషల్‌ మీడియాలో ఓ వీడియో అప్‌లోడ్‌ చేసి వాహనదారులకు సజ్జనార్‌ అవగాహన కల్పిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Feb 13, 2021 12:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).