Delhi Liquor Policy Case: కవితకు మళ్లీ షాక్, జ్యుడిషియల్ కస్టడీ జులై 7వ తేదీ వరకు పొడిగింపు,

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని జులై 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

Delhi Liquor Policy Case: కవితకు మళ్లీ షాక్, జ్యుడిషియల్ కస్టడీ జులై 7వ తేదీ వరకు పొడిగింపు,
BRS Leader K Kavitha (File Image)

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని జులై 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసిన నేపథ్యంలో కోర్టు ముందు ఆమెను వర్చువల్‌గా సీబీఐ అధికారులు హాజరుపరిచారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆమె జ్యుడిషియల్ కస్టడీలోభాగంగా న్యూఢిల్లీలోని తీహాడ్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఇదే కేసులో ఆమెను సీబీఐ సైతం విచారించింది. ఆ క్రమంలో ఆమె నుంచి కీలక విషయాలను సీబీఐ రాబట్టింది. మరోవైపు ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఇటీవ‌లే ములాఖత్ అయిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీలోని తీహార్‌ జైలులో ఉన్న కవితను మంగళవారం వారు కలిశారు. కవిత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

(The above story first appeared on LatestLY on Jun 21, 2024 04:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).