Destruction Of Pochamma Temple: పోచమ్మ దేవాలయంలో అమ్మవారి బట్టలను తీసేసిన దుండగులు.. అమ్మవారి కళ్ళు ధ్వంసం.. శంషాబాద్ లో ఘటన (వీడియో)

హిందూ దేవాలయాలపై వరుస దాడులతో శంషాబాద్ ప్రాంతం ఉలిక్కి పడుతున్నది. మొన్న ఎయిర్ పోర్ట్ కాలనీ లోని హనుమాన్ దేవాలయం, కట్ట మైసమ్మ దేవాలయంపై దాడులను మరిచిపోకముందే తాజాగా మరో దారుణం జరిగింది.

Destruction Of Pochamma Temple: పోచమ్మ దేవాలయంలో అమ్మవారి బట్టలను తీసేసిన దుండగులు.. అమ్మవారి కళ్ళు ధ్వంసం.. శంషాబాద్ లో ఘటన (వీడియో)
Destruction Of Pochamma Temple (Credits: X)

Hyderabad, Nov 10: హిందూ దేవాలయాలపై (Hindu Temples) వరుస దాడులతో శంషాబాద్ ప్రాంతం ఉలిక్కి పడుతున్నది. మొన్న ఎయిర్ పోర్ట్ కాలనీ లోని హనుమాన్ దేవాలయం, కట్ట మైసమ్మ దేవాలయంపై దాడులను మరిచిపోకముందే తాజాగా మరో దారుణం జరిగింది. జూకల్ గ్రామంలోని చౌడమ్మ పోచమ్మ దేవాలయంలోకి శనివారం చొరబడ్డ కొందరు దుండగులు అమ్మవారి  బట్టలను తీసి పారేశారు. అంతటితో ఆగకుండా అమ్మవారి కళ్ళను ధ్వంసం చేశారు  సంఘటన స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు.. గుడి వద్ద పరిస్థితిని చక్కబెట్టారు. ఘటనపై స్థానికులు మండిపడ్డారు.

బైక్‌ పై ఆడుకుంటూ కూర్చున్న చిన్నారి ప్రమాదవశాత్తూ రోడ్డుపైకి.. అప్పుడే ట్రక్కు రావడంతో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో..!

Here's Video:

సిద్ధాంతి కట్ట మైసమ్మ ఆలయంలో కూడా

శుక్రవారం మధ్యాహ్నం శంషాబాద్ లో స్థానికంగా ఉన్న  సిద్ధాంతి కట్ట మైసమ్మ దేవాలయంలోకి ప్రవేశించిన (Destruction Of Katta Maisamma's Trident) ఓ దుండగుడు బరితెగించాడు. గర్భాలయం ముందు ఉన్న అమ్మవారి త్రిశూలాన్ని ధ్వంసం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, భక్తులు దుండగుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం దుండగుడిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అలర్ట్.. హైదరాబాద్‌ లో రేపు తాగునీరు బంద్.. ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 వరకు నీళ్లు రావన్న అధికారులు.. ఎందుకంటే??

(The above story first appeared on LatestLY on Nov 10, 2024 07:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).