Hyderabad Shocker: అక్రమ సంబంధముందనే అనుమానంతో భార్య తల నరికిన భర్త, నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన యువకుడు, రాజేంద్రనగర్‌లో ఘటన

తన భార్య ఇంకెవరితోనే అక్రమ సంబంధం(extramarital relationships) పెట్టుకుందనే అనుమానం పర్వేజ్ మెదడును తొలిచేసింది. అప్పటికే గంజాయి(Ganja)తో పాటూ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు పర్వేజ్. గురువారం రాత్రి మత్తులో ఇంటికి వచ్చిన పర్వేజ్‌...తన భార్యతో గొడవ పడ్డాడు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కత్తితో సమ్రీన్ గొంతు కోశాడు.

Hyderabad Shocker: అక్రమ సంబంధముందనే అనుమానంతో భార్య తల నరికిన భర్త, నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన యువకుడు, రాజేంద్రనగర్‌లో ఘటన
Representative Image Murder ( Photo Credits : Pixabay

Hyderabad December 10: భార్యపై అనుమానంతో దారుణానికి ఒడిగట్టాడు హైదరాబాద్‌(Hyderabad) కు చెందిన ఓ వ్యక్తి. భార్య తలను నరికి(beheads wife) నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌(Rajendra Nager)లో నివాసం ఉండే పర్వేజ్‌(Parvez) అనే వ్యక్తికి సమ్రీన్(Samreen) అనే మహిళతో 14 ఏళ్ల క్రితం పెళ్లయింది. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కొన్నేళ్ల క్రితం వీరికి పెద్ద పెద్ద గొడవలు అవ్వడంతో విడిపోయారు. ఇటీవలే మళ్లీ కలిసి కాపురం చేస్తున్నారు.

అయితే తన భార్య ఇంకెవరితోనే అక్రమ సంబంధం(extramarital relationships) పెట్టుకుందనే అనుమానం పర్వేజ్ మెదడును తొలిచేసింది. అప్పటికే గంజాయి(Ganja)తో పాటూ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు పర్వేజ్. గురువారం రాత్రి మత్తులో ఇంటికి వచ్చిన పర్వేజ్‌...తన భార్యతో గొడవ పడ్డాడు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కత్తితో సమ్రీన్ గొంతు కోశాడు. అంతటితో ఆగకుండా తలను(beheads wife) వేరు చేసి సంచిలో వేసుకొని నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

Tirupati Murder Case: దారుణం..భర్తే భార్యను చంపి పొదలమాటున కాల్చివేశాడు, తిరుపతి సూట్‌కేసులో కాలిన మృతదేహం ఘటనను చేధించిన పోలీసులు, సీసీటీవీ పుటేజీలో విస్తుపోయే వాస్తవాలు

దీంతో అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు...దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు గంజాయి మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్తున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

(The above story first appeared on LatestLY on Dec 10, 2021 06:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).