Polling Time In Telangana: తెలంగాణలో పోలింగ్ పై కీలక నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం, అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు పోలింగ్ సమయం పెంపు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని (Polling Time) పొడిగించింది ఎన్నికల సంఘం. పోలింగ్ సమయాన్ని గంటపాటు పొడిగించింది. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ (Polling) ఉంటుందని ప్రకటించింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ సమయాన్ని పొడిగించాలంటూ రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తితో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
Hyderabad, May 01: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని (Polling Time) పొడిగించింది ఎన్నికల సంఘం. పోలింగ్ సమయాన్ని గంటపాటు పొడిగించింది. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ (Polling) ఉంటుందని ప్రకటించింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ సమయాన్ని పొడిగించాలంటూ రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తితో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. సమస్యాత్మక, ఏజెన్సీ, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుందని స్పష్టం చేసింది.
మే 13న లోక్ సభ స్థానాలకు తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ కు సమయం ఇచ్చింది. తాజాగా ఆ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు.
(The above story first appeared on LatestLY on May 01, 2024 09:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

