KCR

Hyderabad, May 01: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు (KCR) కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నికల ప్రచారంపై నిషేధం (Ban on KCR Campaign) విధించింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదని.. ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో కాంగ్రెస్ పై కేసీఆర్ చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై ఈసీ చర్యలు చేపట్టింది. కేసీఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించింది ఈసీ. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు ప్రచారం నిర్వహించవద్దని కేసీఆర్ ను ఆదేశించింది ఈసీ (EC). ఏప్రిల్ 5న సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూ ఏప్రిల్ 6న ఈసీకి పిర్యాదు చేసింది కాంగ్రెస్.

 

దీనిపై కేసీఆర్ కు నోటీస్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. సమాధానం ఇచ్చేందుకు వారం రోజుల సమయం కావాలని ఈసీకి లేఖ రాశారు కేసీఆర్. వారం రోజుల తర్వాత కూడా ఈసీ నోటీసుకు సమాధానం ఇవ్వలేదు కేసీఆర్. కేసీఆర్ నిర్లక్ష్య వైఖరిని సీరియస్ గా తీసుకున్న ఈసీ ఆయన ఎన్నికల ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం విధించింది.