Telangana Cabinet Meeting: తెలంగాణ ప్ర‌భుత్వానికి ఎన్నికల సంఘం షాక్, అనుమ‌తి రాక‌పోవ‌డంతో కేబినెట్ స‌మావేశం వాయిదా

నివారం మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒక వైపు లోక్‌స‌భ ఎన్నిక‌ల కోడ్, మ‌రో వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో కేబినెట్‌ సమావేశానికి అనుమతించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈసీని కోరింది.

Telangana Cabinet Meeting: తెలంగాణ ప్ర‌భుత్వానికి ఎన్నికల సంఘం షాక్,  అనుమ‌తి రాక‌పోవ‌డంతో కేబినెట్ స‌మావేశం వాయిదా
Telangana Cabinet Meeting (photo-ANI)

Hyderabad, May 18:  కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తీవ్ర నిరాశ ఎదురయ్యింది. ఎన్నికల కమిషన్ (Election Commission) నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Telangana Cabinet Meeting) వాయిదా పడింది. శనివారం మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒక వైపు లోక్‌స‌భ ఎన్నిక‌ల కోడ్, మ‌రో వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో కేబినెట్‌ సమావేశానికి అనుమతించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈసీని కోరింది. కానీ శనివారం రాత్రి వరకు ఈసీ నుంచి అనుమతి రాలేదు. ఈసీ (EC) నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇవాళ సాయంత్రం జరగాల్సిన కేబినెట్‌ భేటీ నిలిచిపోయింది. ఈసీ నుంచి ఏ క్షణమైన అనుమతి వస్తుందని మంత్రులు అందరూ శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సచివాలయంలోనే వేచి ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల అధికారులు కేబినేట్ భేటీకి హాజరయ్యేందుకు ఆఫీసులకు చేరుకున్నారు. కానీ రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో కేబినేట్ భేటీ జరగలేదు. సీఎంతో పాటు మంత్రులు వెనుదిరిగి వెళ్లారు.

 

రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలపై ఈ భేటీలో చర్చించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎజెండా సిద్ధం చేసుకుంది. కానీ ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో రైతుల సంక్షేమం, అత్యవసరమైన అంశాలపై చర్చించలేకపోయామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఈసీ నుంచి అనుమతి ఎప్పుడు వస్తే.. అప్పుడే కేబినేట్ భేటీ జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. సోమవారం లోపు ఈసీ నుంచి అనుమతి రాకపోతే, అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అనుమతి కోరుతామని చెప్పారు.

(The above story first appeared on LatestLY on May 18, 2024 08:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).