Harish Rao Challenge To Revanth Reddy: కేసీఆర్ కు వెయ్యి ఎక‌రాల ఫామ్ హౌజ్, నిరూపించేందుకు సిద్ధ‌మా? అంటూ స‌వాల్ విసిరిన హ‌రీష్ రావు

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి పచ్చి అబద్దాలు మాట్లాడటానికి నోరెలా వచ్చింది రేవంత్ రెడ్డి (CM Revanth reddy) అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao) ప్ర‌శ్నించారు. కేసీఆర్‌కు గ‌జ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫాం హౌజ్ ఉన్నట్లు అబద్ధాలు మాట్లాడం కాదు. నిరూపించేందుకు సిద్దమా..? నిరూపించకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తవా..?అని రేవంత్ రెడ్డికి హ‌రీశ్‌రావు స‌వాల్ విసిరారు.

Harish Rao Challenge To Revanth Reddy: కేసీఆర్ కు వెయ్యి ఎక‌రాల ఫామ్ హౌజ్, నిరూపించేందుకు సిద్ధ‌మా? అంటూ స‌వాల్ విసిరిన హ‌రీష్ రావు
BRS Harish Rao Shocking Comments on Telangana CM Revanth Reddy(X)

Hyderabad, NOV 30: ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి పచ్చి అబద్దాలు మాట్లాడటానికి నోరెలా వచ్చింది రేవంత్ రెడ్డి (CM Revanth reddy) అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao) ప్ర‌శ్నించారు. కేసీఆర్‌కు గ‌జ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫాం హౌజ్ ఉన్నట్లు అబద్ధాలు మాట్లాడం కాదు. నిరూపించేందుకు సిద్దమా..? నిరూపించకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తవా..? (Harish Rao Challenge) అని రేవంత్ రెడ్డికి హ‌రీశ్‌రావు స‌వాల్ విసిరారు. ఇప్పటికే నీకు కాంగ్రెస్ తత్వం బోధపడినట్లుంది. మల్లా అవకాశం వస్తదా?  అని భయపడుతున్నవు. అసెంబ్లీకి రమ్మని తెగ పిలుస్తున్నావు రేవంత్ రెడ్డి. మేము ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నం. మీ ఏడాది పాలనలో అన్ని వర్గాలను ఏడిపించడమే తప్ప ప్రజలకు చేసిందేం లేదు. అబద్దాలు చెబుతూ ఏడాది నడిపించావు. ఈ అబద్దాలతో ఇంకా ఎంతో కాలం మోసం చేయలేవు.

RS Praveen Kumar: కొండా మురళిపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్..ఎంతోమంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేశాడు, దీనికి సాక్ష్యం కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు అని వెల్లడి  

అసెంబ్లీలో నీ ఏడాది పాలన అసలు రంగు బయట పెట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీలో మైకులు కట్ చేయకుండా సమయం కేటాయించే దమ్ము మీకుందా? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

(The above story first appeared on LatestLY on Nov 30, 2024 10:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).