Harish Rao On Rythu Bharosa: రైతు భరోసా భోగస్..కనీస మద్దతు ధర ఏది?, రైతులను మోసం చేసినందుకు విజయోత్సవాలా?...సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌ రావు ఫైర్

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్​నగర్​లో నేటి నుంచి మూడు రోజుల పాటు రైతుపండగ నిర్వహణకు సర్కారు ఏర్పాట్లు చేసింది.కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం తొలి ఏడాదిలోనే రూ.54,280 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Harish Rao On Rythu Bharosa: రైతు భరోసా భోగస్..కనీస మద్దతు ధర ఏది?, రైతులను మోసం చేసినందుకు విజయోత్సవాలా?...సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌ రావు ఫైర్
Harish Rao questions CM Revanth Reddy On Runa Mafi And Rythu Bharosa(X)

Hyd, Nov 28:  ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్​నగర్​లో నేటి నుంచి మూడు రోజుల పాటు రైతుపండగ నిర్వహణకు సర్కారు ఏర్పాట్లు చేసింది.కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం తొలి ఏడాదిలోనే రూ.54,280 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఏడాది పాలనలో రైతులను విజయవంతంగా దగా చేసినందుకు రైతు పండుగ అంటూ మూడు రోజుల విజయోత్సవాలు చేస్తున్నావా రేవంత్ రెడ్డి ?, గొప్పగా చెప్పిన వరంగల్ రైతు డిక్లరేషన్ లోని 9 హామీల్లో ఒక్కటీ అమలు చేయనందుకు పండుగ చేస్తున్నావా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. రుణమాఫీ ఎగ్గొట్టి, రైతు భరోసా బోగస్ చేసి, కనీస మద్దతు ధరకు పంట కొనుగోలు చేయకుండా రైతులను ఏడ్పిస్తున్నందుకు చేస్తున్నావా రేవంత్ రెడ్డి?...మీ ఏడాది దుర్మార్గ పాలనలో 563 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినందుకు పండుగ చేస్తున్నావా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు.

చెప్పింది కొండంత, చేసింది గోరంత. ఎన్నికల ప్రచారంలో రైతులను మభ్య పెట్టావు. అధికారంలోకి వచ్చాక నిండా ముంచావు..కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మీరు ఏం చేసింది? కేసీఆర్ గారు ఇచ్చిన రైతుబంధు పథకానికి ఎగనామం పెట్టారు అన్నారు.నూటొక్క దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తానని మోసం చేశారు. సగం మందికి మొండి చెయ్యి చూపారు...24 గంటల నాణ్యమైన కరెంటు అందించలేక చేతులెత్తేశారు అన్నారు. పంటలకు మద్దతు ధర లేదు, అన్ని పంటలకు బోనస్ అసలే లేదు. కొనుగోలు కేంద్రాలు లేవు; అది పత్తి అయినా, ధాన్యం అయినా...కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తానన్న భరోసా దిక్కులేదు అన్నారు.

ఈ ఏడాది పాటు రైతులకు మీరు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు రైతు పండుగ నిర్వహించడం సిగ్గుచేటు...పైగా, ఏడాది పాలనలో రైతు సంక్షేమం కోసం 54,280 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం చేసుకోవడం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఉందన్నారు. రైతు బీమా, ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోళ్ళ కోసం మీరు ఖర్చు చేసినా అని చెప్పిన రూ. 27,486 కోట్లు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు చేసింది. ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సి ఉంటుందే..కానీ, కొత్తగా తామేదో రైతులకు చేసినట్లు డబ్బా కొట్టుకోవడం రైతులను మరోసారి మోసం చేయడమే. ఇదేనా కాంగ్రెస్ మార్కు మార్పు? అన్నారు.  రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ స‌మ‌ర‌శంఖం, గురుకుల బాట‌కు పిలుపునిచ్చిన కేటీఆర్ 

మీ మేనిఫెస్టో ప్రకారం రైతులకు పడిన బాకీ...

రుణమాఫీ కింద దాదాపు 14,000 కోట్లు

ఖరీఫ్ రైతు బంధు కింద 7,500 కోట్లు

కౌలు రైతులకు మరో 3,000 కోట్లు

రైతు కూలీలకు 16,00 కోట్లు

అన్ని పంటలకు బోనస్ సుమారు 3,000 కోట్లు

అకాల వర్షాలకు గానూ పంట నష్టం సుమారు 11,700 కోట్లు (కేంద్రానికి రాష్ట్రం పంపిన రిపోర్టు)

ఈ ఏడాది కాలంలో మొత్తం రూ. 40,800 కోట్లు రైతులకు బాకీ పడ్డారు. మీకు, మీ పార్టీకి రైతుల సంక్షేమం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. రైతులకు బాకీ పడ్డ రూ. 40,800 కోట్లతో పాటు, ఈ రబీకి ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా వెంటనే విడుదల చేసి పండుగ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).