Hyderabad, NOV 27: రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు, పాఠశాలల్లో నెలకొన్న దుస్థితిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ సంక్షోభంలోకి నెట్టిందని మండిపడ్డారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. గురుకుల బాట (Gurukula Bata) కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు(KGBVB), మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నేతలు పరిశీలించనున్నారని తెలిపారు.
KTR Calls For Gurukula Bata
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను పరిశీలించనున్న భారత రాష్ట్ర సమితి… pic.twitter.com/95Of0pcQ6O
— BRS Party (@BRSparty) November 27, 2024
గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ రెడ్డి సర్కార్ సంక్షోభంలోకి నెట్టిందని కేటీఆర్ విమర్శించారు. 11 నెలల్లో 52 మంది విద్యార్థుల మరణించారని.. ఇందులో 38 ఫుడ్ పాయిజన్ సంఘటనలు ఉన్నాయని తెలిపారు. పాలన గాలికొదిలేసి నేరపూరిత నిర్లక్ష్యంతో ముఖ్యమంత్రివిద్యార్థులను పొట్టన బెట్టుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడని.. ముఖ్యమంత్రికి ఢిల్లీకి తిరిగేందుకే సమయం సరిపోతలేదని విమర్శించారు. విద్యార్థులు చనిపోతున్నా ఒక్క సమీక్ష కూడా నిర్వహించని ప్రభుత్వానికి ఉసురు తప్పదని అన్నారు.
గురుకులాలు (Gurukul), కేజీబీవీ, మోడల్ స్కూళ్ల పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ తరఫున అధ్యయన కమిటీ వేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో గురుకుల అధ్యయన కమిటీ వేశామని చెప్పారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా గురుకుల బాట కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ అధ్యయన కమిటీ బీఆర్‌ఎస్ పార్టీకి నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. ఈ నివేదిక అంశాలను శాసనసభలో లేవనెత్తుతామని స్పష్టం చేశారు.