Bhupalpally Murder Case Update.. Police File FIR(X)

Hyd, Feb 20:  భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య సంచలనంగా మారింది(Bhupalpally Murder Case). ఈ హత్య నేపథ్యంలో అధికార కాంగ్రెస్ - ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రాజలింగమూర్తి(Rajalinga Murthy) హత్యను ఖండించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి .

బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దోపిడి, అవినీతి పై ప్రశ్నించి కేసులు వేసినందుకే లింగమూర్తిని హత్య చేశారు అని ఆరోపించారు కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy). కొన్ని నెలల క్రితం ఇదే కేసు విషయం నడుస్తుండగా సంజీవ రెడ్డి అనే న్యాయవాది కూడా అనుమానస్పదంగానే చనిపోయారన్నారు. రాజలింగముర్తి హత్యపై సీబీసీఐడీతో విచారిస్తామని స్పష్టం చేశారు. రాజలింగమూర్తి కేసును ఫాస్ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని చెప్పారు. రాజలింగముర్తిని గండ్ర వెంకట రమణా రెడ్డి హత్య చేయించారన్నారు. దీని వెనక కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఉన్నారని ఆరోపించారు.

 మేడిగడ్డ కుంగుబాటు.. కేసీఆర్‌పై కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య, భూపాలపల్లిలో లింగమూర్తిని దారుణంగా చంపేసిన దుండగులు, కేటీఆర్ ఆదేశాలతోనే హత్య జరిగిందని మృతుడి భార్య ఆవేదన

హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు. దీని వెనుక ఎవరున్నారో, హత్య ఎందుకు చేశారో నిజాలు అన్నీ బయటపడతాయి అని... భూపాలపల్లిలో హత్యా రాజకీయాలకు తావు ఉండకూడదు అన్నారు. అదే నా లక్ష్యం మరియు మా ప్రభుత్వ లక్ష్యం కూడా అన్నారు.

భూపాల పల్లి లో రాజలింగ మూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు బీఆర్ఎస్ నేత,మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన గండ్ర.. హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతోందన్నారు. ఈ హత్యను బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించాలని కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోందన్నారు.

స్థానిక భూ వివాదం నేపథ్యం లో ఈ హత్య జరిగిందని ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదైందన్నారు.కొందరి ఒత్తిడి తో రాజలింగ మూర్తి భార్య నాపై ఆరోపణలు చేస్తున్నారు ..ఈ హత్యపై సీబీ సీఐడి విచారణ ను కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు అన్నారు. సీబీసీఐడీ కాదు సిబిఐ విచారణ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు ..మేడిగడ్డ పై రాజలింగమూర్తి కోర్టులో కేసు వేశారు ..దాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటున్నాం అన్నారు.

మృతుడి పై రౌడీ షీట్ కూడా ఉందని, బీ ఆర్ ఎస్ పై నా పై ఆరోపణలు చేయడం ద్వారా విచారణను ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు అన్నారు. హత్యలో అరెస్టయిన వ్యక్తుల పేర్లతో రాజలింగ మూర్తి పోలీసులకు పిర్యాదు కూడా చేశారు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి కి మతి భ్రమించిందన్నారు.

కాంగ్రెస్ నేతలు కుటిల రాజకీయాలు మానుకుంటే మంచిదన్నారు.

ఇక నాగవెల్లి రాజలింగ మూర్తి హత్య కేసులో ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు ఉన్న నిందితులు రెంకుంట్ల సంజీవ్, పింగిలి శ్రీమంత్, మోర్ కుమార్, కోతురి కుమార్, మరియు రెంకుంట్ల కొమురయ్య గా గుర్తించారు.

ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. 53 ఏళ్ల మూర్తి తన బైక్‌పై వెళ్తుండగా, సాయంత్రం 7:30 గంటల సమయంలో రెడ్డి కాలనీలో దుండగులు ఆయనపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ, అక్కడికి చేరుకునే లోపే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.