Nagavelli Rajalingamurthy who filed corruption case against KCR found murdered in Telangana

Hyd, Feb 20:  తెలంగాణలోని భూపాలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్​ ప్రభుత్వం, కేసీఆర్ కారణమని కేసు వేసిన రాజలింగమూర్తి(47)(Raja Lingamurthy) దారుణ హత్యకు గురయ్యారు(Brutual Murder at Bhupalapally). బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపారు.

ఈ ఘటనకు కేటీఆర్(KTR), మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి(Gandra Venkata Ramana reddy) కారణమని మృతుడి భార్య ఆరోపించారు. గండ్ర వెంకటరమణ రెడ్డినే గుండాల చేత నా భర్తని చంపించాడని మండిపడింది. వెంకటరమణ రెడ్డి కేటీఆర్ కి కాల్ చేశాడు... నా భర్తను చంపమని కేటీఆర్...వెంకటరమణ రెడ్డికి చెప్పాడు, దీంతో గండ్ర వెంకటరమణ రెడ్డి...సంజీవ మరియు ఇంకొందరు వ్యక్తులతో నా భర్తను చంపించాడు అని కన్నీరు మున్నీరుగా విలపించారు. కాళేశ్వరం, మేడిగడ్డ అక్రమాలపై నా భర్త కేసు వేసినందుకే చంపించారు అని ఆరోపించారు.

ఏకంగా 36 పేజీలతో ఆహ్వాన పత్రిక... ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న బంధువులు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

రాజలింగమూర్తి హత్యపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీరియస్ అయినట్లు సమాచారం. సీబీసీఐడీ విచారణకు ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హత్యపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. కేసీఆర్, హరీష్ రావు లను ఎదిరించినందుకే రాజలింగమూర్తి హత్య జరిగిందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రాజలింగమూర్తిని చంపారు ... ఉద్యమ కాలంలో ఆత్మహత్యలను ప్రేరేపించి లబ్ది పొందారు, ఇప్పుడేమో హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌పై కేసు పెట్టిన రాజలింగమూర్తి నడిరోడ్డుపై దారుణ హత్య, వెంటాడి కత్తులతో తలపై, పొట్టపై పొడిచి చంపిన దుండగులు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

రాజలింగమూర్తి హత్యను ఖండించారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల అవినీతిపై ప్రశ్నించిన వామనరావు దంపతులను హత్య చేపించారు అన్నారు. కాళేశ్వరం అక్రమాలపై మొదటి నుంచి పోరాడుతున్న లింగమూర్తి హత్య చాలా బాధాకరం...

దీని వెనుక రాజకీయ కుట్ర కోణం దాగి ఉందని, మాజీ ఎమ్మెల్యే గండ్ర హస్తం ఉందని వాళ్ల కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్నారు, పోలీసులు పారదర్శకంగా విచారణ జరిపి నిందితులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Nagavelli Rajalingamurthy who filed corruption case against KCR found murdered in Telangana

ఇక బీఆర్ఎస్ నేతలు సైతం రాజలింగమూర్తి హత్యను ఖండించారు. భూతగాదాల నేపథ్యంలో జరిగిన హత్యను తమకు ముడిపెట్టడం సరికాదని మండిపడ్డారు. 2019లో భూపాలపల్లి లోని 15వ వార్డు నుంచి బీఆర్ఎస్​ తరఫున రాజలింగమూర్తి భార్య సరళ కౌన్సిలర్‌గా గెలుపొందారు. కొద్ది నెలల తర్వాత నాగవెళ్లి సరళను బీఆర్ఎస్​ పార్టీ నుంచి బహిష్కరించారు. కొన్నిరోజులుగా లింగమూర్తి ... వరంగల్‌కు చెందిన ఓ ప్రముఖ న్యాయవాది ద్వారా భూ సమస్యలను పరిష్కరించేవారు. రాజలింగమూర్తిపై గతంలో పలు కేసులు కూడా నమోదయ్యాయి.

గతంలో ఓపెన్‌కాస్ట్‌ గనుల తవ్వకాలతో పర్యావరణం దెబ్బతింటోందని సింగరేణిపై ఎన్​జీటీ( నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌)లో ఫిర్యాదు కూడా చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్‌ చేశారు.